భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అద్భుతం చేసింది. ఒకనాడు తన ఆటతీరు బాగాలేదన్న విమర్శకులకు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకుతో సానియా సమాధానమిచ్చింది. ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చాన్నాళ్లుగా ఊరిస్తున్న నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుని తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది సానియా.
ఫ్యామిలీ సర్కిల్ కప్ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. 58 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా - హింగిస్ ద్వయం 6-0, 6-4 తో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా) - దరిజా జురాక్ (క్రొయషియా) జంటపై గెలిచింది. దీంతో సానియా జంటకు 39 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 24 లక్షల 28 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టైటిల్‌తో మహిళల టెన్నిస్ సంఘం డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను హస్తగతం చేసుకుంటుంది. హింగిస్‌తో కలిసి సానియాకిది వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం. ఇంతకుముందు పురుషుల డబుల్స్‌లో భారత్ నుంచి వెటరన్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించారు.