దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తూ దూసుకెళుతున్నారు. నింగి(ఆకాశం).. నేల(భూమి).. నీరు(సముద్రం) ఇలా ఎక్కడ చూసినా మగవారిని తాము ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అంతరిక్ష యాత్రలు చేస్తూ అందరి ప్రశంసలను పొందుతున్నారు.
దేశ రక్షణ విభాగంలోనూ ప్రస్తుతం మహిళలు సేవలందిస్తున్నాయి. అయితే కొన్ని నిబంధనలు వారికి అడ్డంకులుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఇటీవల కేంద్ర రక్షణ విభాగాల్లోనూ మహిళలకు సరైన ప్రాధాన్యం కల్పించాలని తీర్పు నిచ్చింది. దీంతో అందివచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుంటూ రక్షణ విభాగంలోనూ సత్తా చాటుతున్నారు.
తాజాగా ఓ ముస్లిం యువతి ఫైటర్ పైలట్ గా ఎంపికై చరిత్ర సృష్టించింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సానియా మీర్జా దేశంలో తొలి ముస్లిం ఫైటర్ పైలెట్ గా ఎంపికవడంతో ప్రతీఒక్కరూ ఆమెను అభినందిస్తున్నారు. చిన్నతనం నుంచి ఫైటర్ పైలట్ కావాలనే తన కోరికను సానియా మీర్జా నిజం చేసుకుందని ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సానియా మీర్జా యూపీలోని మిర్జాపూర్ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి షాహిద్ అలీ టీవీ మెకానిక్ కాగా.. తల్లి తబస్సుమ్ మీర్జా గృహిణి. సానియా చిన్నతనం నుంచి ఫైటర్ పైలట్ కావాలనేది కలలు కనేది. భారత తొలి మహిళా ఫైటర్ పైలట్ అవని చతుర్వేదిని రోల్ మోడల్ గా తీసుకుని తాను సైతం ఫైటర్ పైలట్ కావాలని లక్ష్యంగా ముందుకు సాగింది.
ఎంతోమంది మహిళలు యుద్ధ విమానాలను అవలీలగా నడుపుతున్నారని వారిలా తాను సైతం ఫైటర్ ఫైలట్ కావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పట్టుదలతో చదువును కొనసాగించింది. మీర్జాపూర్‌లోని ఓ డిఫెన్స్ అకాడమీలో చేరిన సానియా మీర్జా శిక్షణ తీసుకొని ఎన్డీఏ పరీక్షలకు హాజరైంది.
ఎన్టీఏ పరీక్షల్లో ఇటీవల వెల్లడికాగా సానియా 149వ ర్యాంక్‌ను సాధించింది. డిసెంబర్ 27న పుణె ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ కోసం సానియా చేరనుందని సమాచారం. తన సానియా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కూతురు తన కలను నిజం చేసుకోవడమే కాకుండా మొత్తం ఊరంతా గర్వపడేలా చేసిందని సంతోషం వ్యక్తం చేశారు.
కాగా సానియా మీర్జా మాట్లాడుతూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షల్లో మహిళల కోసం కేవలం రెండు ఫైటర్ పైలట్ పోస్ట్‌లే రిజర్వ్ చేశారని తెలిపింది. మొదటి ప్రయత్నంలో సీటు చేజారిందని.. అయితే రెండో ప్రయత్నంలో మాత్రం సీటు దక్కిందని పేర్కొంది.
తన విజయానికి తల్లిదండ్రులు.. కోచింగ్ సెంటర్ కారణమని చెబుతోంది. మొత్తానికి సానియా తన కలను సాకారం చేసుకోవడంతో పాటు దేశంలోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ ఫైలట్ గానూ రికార్డు సృష్టించడంతో ప్రతీఒక్కరూ ఆమెకు అభినందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.