ప్రముఖ టెన్నిస్ స్టార్ తన ఆత్మకథను అమ్ముకోవడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూల సందర్భంగా దేశంలోని సీనియర్ జర్నలిస్టుల రాజదీప్ సర్దేశాయ్ పై ఆగ్రహావేశాలు వ్యక్తంచేసింది. అలా అని ఆయనేమీ అంత తప్పుడు ప్రశ్నా అడగలేదు.. అమర్యాదకరంగానూ ప్రశ్నించలేదు. ‘‘ఎంతో సాధించారు కదా.. ఇక తల్లయ్యేదెప్పుడు?’’ అంటూ సంతోషకర వార్త ఎప్పుడు వింటామని పెద్ద తరహాలో అడిగారు. కానీ... సానియాకు ఆ ప్రశ్న కోపం తెప్పించేసింది. ఆయనపై మండిపడిపోయింది. దీంతో ఆయన ఎందుకొచ్చిన గొడవంటూ సారీ చెప్పేశారు. ఆ తరువాత సానియా... ఈ రోజు ఇండియాలో ఒక పెద్ద జర్నలిస్టుతో సారీ చెప్పించుకున్నానంటూ గొప్పలు పోయింది.
సానియా తన క్రీడా ప్రస్థానంపై ‘ఏస్ అగెనెస్ట్ ఆడ్స్’ పేరిట ఆమె రాసుకున్న పుస్తకాన్ని హైదరాబాద్ లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ పుస్తక ప్రమోషన్ లో భాగంగా ఆమె పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్యూలు ఇచ్చారు. రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా ఒక ఛానల్ తరపున ఇంటర్వ్యూ చేశారు. కేరీర్ గురించి ప్రశ్నలు అడిగిన తర్వాత జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతున్నారు?. ఎప్పుడు అమ్మవుతారు అని ప్రశ్నించారు. దీంతో సానియా ఫీలయిపోయింది. కోపం తెచ్చుకుంది. మీ ప్రశ్న నన్ను చాలా నిరాశపరిచింది. ఇలాంటి ప్రశ్నలు మహిళలకే ఎదురవుతాయి. వాటిని ఫేస్ చేయాల్సి వస్తోంది. దురదృష్టవశాత్తు పెళ్లి ఆ తర్వాత పిల్లలు అన్న ప్రేమ్‌లో సెటిల్ అయిపోయాం అని వ్యాఖ్యానించారు. మాతృత్వం ఎప్పుడు? అని అడిగే ముందు నేను సాధించిన టైటిళ్లు కనిపించడం లేదా? అని ఎదురు ప్రశ్నించారు.
దీంతో రాజ్ దీప్ వెంటనే తేరుకున్నారు. ఈ ప్రశ్న వేసినందుకు చాలా చింతిస్తున్నాను. క్షమించండి అని అన్నారు. ‘మీకు వేసిన ప్రశ్నలను నేను ఇప్పటిదాకా ఏ పురుష క్రీడాకారుడికి వేయలేదు. తప్పు చేశాను. మన్నించండి” అంటూ హుందాగా క్షమాపణ కోరారు. అయితే.. సానియా మాత్రం నా జీవితంలో తొలిసారిగా ఒక నేషనల్ మీడియా ప్రతినిధితో సారీ చెప్పించుకోగలిగాను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అందుకు సంతోషంగా ఉందని చెప్పుకొంది.