ప్రాణాలు తీసేస్తున్న ‘శానిటైజర్’

Update: 2021-03-24 04:30 GMT
‘శానిటైజర్’ బహుశా ఈ పదం కరోనాకు ముందు ఉన్నత వర్గాల ప్రజలకు, వైద్యులకు మాత్రమే తెలిసి ఉంటుంది. మామూలు ప్రజలు శానిటైజర్​ను వాడిన సందర్భాలు చాలా తక్కువ. కానీ కరోనా ఎఫెక్ట్​తో శానిటైజర్​ ప్రతి ఇంట్లోనూ నిత్యావసరం అయిపోయింది. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లేటప్పుడూ చిన్న శానిటైజర్ బాటిల్​ను క్యారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా క్రిములను చంపేందుకు ఉపయోగించాల్సిన ఈ శానిటైజర్​ను ఇప్పుడు మందుబాబులు మత్తు కోసం వాడుతున్నారు. బెజవాడలో శానిటైజర్​ బాధితుల సంఖ్య ఎక్కువవుతున్నది. అక్కడి శానిటైజర్​ తాగి ఇటీవల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు..

శానిటైజరే ఎందుకు? ​

ఆంధ్రప్రదేశ్​లో మద్యం అమ్మకాలు తగ్గించాలని.. ప్రజలను మత్తు చెర నుంచి విడిపించాలన్న సదుద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం మద్యం రేట్లను విపరీతంగా పెంచేసింది. మామూలుగా మద్యానికి బానిసైన నిరుపేదలు ప్రతిరోజు ఓ 90 ఎంఎల్​ తాగితే కానీ వాళ్లకు నిద్రపట్టదు. సో వాళ్లు మద్యం కొనుగోలు చేయాలంటే చీప్​ లిక్కర్​కు కూడా వందల్లో ధర ఉంటుంది. అయితే శానిటైజర్​ బాటిళ్లు మాత్రం తక్కువ ధరకు దొరుకుతున్నాయి. శానిటైజర్​లోనూ ఇథైల్​ ఆల్కాహాల్ ఉంటుంది. అయితే ఇది కూడా మత్తును ఇస్తుంది కానీ.. శరీరానికి ఎంతో హాని చేస్తుంది. ఈ విషయం తెలియని పేద ప్రజలు శానిటైజర్​కు బానిసలవుతున్నారు.మామూలుగా మెడికల్​ షాపుల్లో శానిటైజర్​ బాటిళ్లు కొనుగోలు చేసి.. తాగేస్తున్నారు.

విజయవాడలో ఇటీవల శానిటైజర్​ బాధితుల సంఖ్య పెరిగింది. మద్యం బదులు శానిటైజర్ తాగడం మృత్యువాత పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ టూ టౌన్ లో మధు, సత్యనారాయణ అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా దానికి శానిటైజర్ తాగటమే కారణం అని మృతుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీన్ని ఇంకా పోలీసులు ధ్రువీకరించలేదు. సదరు వ్యక్తులు అతిగా మద్యం సేవించడం వల్లే మరణించి ఉంటారని మేము భావిస్తున్నాం అని పోలీసులు చెబుతున్నారు.

 ఈ విషయంపై వైద్య నివేదికలు వస్తే గానీ అసలు విషయం బయట పడదు.ప్రస్తుతం ఈ ఘటనలపై పోలీసులు ఇంకా ఫిర్యాదులు చేయలేదు. ల్యాబ్ రిపోర్టులు వస్తే కేసు పెట్టలేమని పోలీసులు అంటున్నారు. అయితే శానిటైజర్లు తక్కువ ధరకు దొరుకుతుండటంతో చాలా మంది దాన్ని కూల్​డ్రింక్​లో కలుపుకొని తాగుతున్నారని వైద్యులు అంటున్నారు. ఇది చాలా డేంజర్​ అని సూచిస్తున్నారు.
Tags:    

Similar News