తాగే ఆల్కాహాల్ దానికి వాడుతున్నారా?

Update: 2020-03-12 08:14 GMT
మద్యానికి యమ గిరాకీ ఉంటుంది. ఎప్పుడు డిమాండ్ ఉండే వస్తువు మద్యం. మద్యంలో వివిధ రకాలు ఉన్నా బీర్ సాధారణ స్థాయి కాగా మందు (వైన్) అనేది అత్యున్నతమైనది. సాధారణంగా తెలుగులో మందు, మద్యం అంటారు కానీ విదేశాల్లో ఆల్కాహాల్ అంటారు. ఆల్కాహాల్ శాతం ఎంత ఎక్కువ ఉంటే అంత కిక్ వస్తుంది. ఈ ఆల్కాహాల్ శాతం కూల్ డ్రింక్స్ లోనూ ఉంటుంది. కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటుండడంతో అంత కిక్ రాదు. కాకపోతే బీరులో కొంత శాతం అధికంగా ఉండడంతో మత్తు అనేది వస్తుంది. మందులో ఆల్కాహాల్ శాతం అధికంగా ఉంటుంది. మెల్లగా మత్తు వస్తూ కిక్ పెరుగుతుంది.


అయితే మన దేశంలో మద్యం గిరాకీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా దేశంలోనే కాకుండా తెలంగాణలో అధికంగా మందు తాగే వారు ఉన్నారు. మందుకు యమ గిరాకీ ఉంటుంది. అయితే మనదేశంలో మందు తాగితే విదేశాలకు ఇతర వాటికి వినియోగిస్తున్నారంట. తాగే ఈ మందును ఇతర పనులకు వినియోగిస్తుండడం గమనార్హం. మనం మందు తాగితే విదేశాల్లో ఆల్కాహాల్ ను శానిటైజ్ పనులకు వాడుతున్నారు. అంటే పరిశుభ్ర చర్యలకు ఆల్కాహాల్ ను వినియోగిస్తున్నారంట. ముఖ్యంగా చేతులు శుభ్రం చేసుకోవడానికి ఆల్కాహాల్ వాడుతున్నారంట. ఎందుకంటే క్రిములను నివారించే శక్తి ఆల్కాహాల్ కు ఉందని గుర్తించిన పరిశోధకులు ఆ మందును శానిటేషన్ పనులకు వాడుతుండడంతో ఫలితం కనిపిస్తోందంట. అందుకే మనం చేతులు శుభ్రం చేసుకునే హ్యాండ్ వాష్ లోషన్స్ లో ఇప్పుడు వాడుతున్నారు.

ప్రస్తుతం వ్యాధులు పొంచి ఉండడంతో ఆల్కాహాల్ తో వాటిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని నివారణ కోసం ఆల్కాహాల్ ను వినియోగించి హ్యాండ్ వాష్ క్రీమ్ లు తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. అవి వినియోగిస్తుండడం తో కొంత సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం తో మరికొన్ని పారిశుద్ధ్య (శానిటైజ్) పనుల కోసం ఆల్కాహాల్ వాడేందుకు సిద్ధమవుతున్నారు.

క్రిముల నివారణకు కూడా మందు ఉపయోగ పడుతుండడంతో మందు బాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాగితే కడుపు లో ఉన్న క్రిములు కూడా చచ్చిపోతాయని ఇంట్లో వారికి చెబుతూ వారు మందు తాగేందుకు కప్పి పుచ్చుకుంటున్నారు. చూశావా మందు తాగితే క్రిములు నాశనమవుతాయని చెబుతూ కొంత డోస్ పెంచే అవకాశం ఉంది. ఏది ఎంతున్నా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే అంశాన్ని గుర్తించుకోవాలని "తుపాకీ" మీడియా సూచిస్తోంది.
Tags:    

Similar News