తాను ఉగ్రవాదిని కాదని.. తనకు ముంబయి బాంబు పేలుళ్ల కేసులో సంబంధం లేదని ఒకటి రెండుసార్లు అందరికి అర్థమయ్యేలా చెప్పుకున్నారు బాలీవుడ్ నటుడు.. ఇటీవలే ఎరవాడ జైలు నుంచి విడుదలైన సంజయ్ దత్. తాను కేవలం అక్రమ ఆయుధం కలిగి ఉన్న కేసులో మాత్రమే తాను దోషినని.. అందుకు ఫలితంగా తాను జైలుశిక్షను అనుభవించానని.. దయచేసి తనను ముంబయి బాంబు పేలుళ్ల ప్రస్తావన తీసుకురావొద్దంటూ జైలు నుంచి విడుదలయ్యాక తనను కలిసిన మీడియా వారిని ఆర్థించారు.
తాను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెబుతున్న సంజయ్ కు పలువురు స్వాగతం పలుకుతుంటే.. షాట్ గన్ గా పిలిచే బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా మాత్రం తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కు హితువు చెప్పినట్లుగా మాట్లాడటం గమనార్హం. ఒక తప్పు జరిగి.. తాను తప్పు తెలుసుకున్నానని.. తాను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పిన తర్వాత.. గతాన్ని కెలకటం అనవసరం.
అతడి మానాన అతడిని వదిలేయటం మంచింది. ఏదైనా తప్పు చేసినప్పుడు మందలించటం బానే ఉంటుంది కానీ.. ఒకసారి తప్పు చేశాడని.. నిత్యం తప్పులే చేస్తాడన్నట్లుగా మాట్లాడటం అంత బాగోదు. షాట్ గన్ శత్రుఘ్న సిన్హా తాజా మాటలు చూస్తే.. సంజయ్ కు చిన్నపాటి క్లాస్ పీకినట్లే కనిపించక మానదు. ‘‘నా ఫ్రెండ్.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలు నుంచి విడుదల కావటం ఆయన కుటుంబ సభ్యుల మాదిరే నేనూ సంతోషపడ్డాను. పైలోకంలో ఉన్న సంజయ్ తండ్రి సునీల్ దత్ ఆత్మ కూడా ఆనందిస్తుంది. లగేరహో మున్నాభాయ్ సినిమాలో చెప్పినట్లుగా గాంధీగిరిని అప్పట్లో సంజయ్ దత్ ఆచరించలేదు. ఇప్పుడైనా ఆయన గాంధీగిరి అనుసరించాలి’’ అని వ్యాఖ్యానించారు. మాటలతో చిన్నబుచ్చే కన్నా.. పాత గాయాన్ని మానేలా మాట్లాడితే షాట్ గన్ లాంటి వారి సొమ్ములేం పోవుగా...?