గన్ కల్చర్ మరోసారి అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. పల్లీలు కొనుక్కున్నంత ఈజీగా తుపాకులు కొనేసే అవకాశం ఉన్న అగ్రరాజ్యంలో ఇప్పటికే పలుమార్లు హింస చెలరేగింది. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. గన్ కల్చర్ పై ఆంక్షలు విధించాలన్నచర్చ అగ్రరాజ్యంలో ఎప్పటి నుంచో ఉన్నదే. అయినప్పటికీ దానికి బ్రేకులు వేసే చర్యలు ఇప్పటివరకూ చోటు చేసుకున్నది లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న కాల్పులు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఒక పాఠశాలలో.. విద్యార్థి ఒకరు జరిపిన కాల్పుల్లో ఏకంగా పది మంది మృత్యువాత పడటం షాకింగ్ గా మారింది. శాంటా ఫే హైస్కూల్లో శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) జరిగినకాల్పుల్లో పది మంది మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులుగా చెబుతున్నారు.
గడిచిన ఏడు రోజుల్లో అమెరికా స్కూళ్లల్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఇది మూడోది కావటం గమనార్హం. కాల్పులకు కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్చిన వ్యక్తి స్కూల్ విద్యార్థేనని చెబుతున్నారు. ఈ కాల్పుల కారణంగా స్కూల్ ఆవరణ రక్తంతో నిండిపోయింది. స్కూల్లో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే.. భయంతో పిల్లలు.. సిబ్బంది పరుగులు తీయటం కనిపించింది. ఈ ఉదంతం అమెరికా వ్యాప్తంగా సంచలనం రేపింది. కాల్పులకు కారణాలు బయటకు రాలేదు.