అన్యమత పత్రిక వివాదం.. పోలీసుల విచారణ!!

Update: 2020-07-09 23:30 GMT
ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక టీటీడీపై అన్యమత ప్రచారం.. వివాదాలు వెంటాడుతున్నాయి. జగన్ సర్కార్ దీనిపై విచారణ జరిపి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతోంది.

అయితే తాజాగా మరో వివాదం చెలరేగింది. గుంటూరులో ఓ వ్యక్తికి టీటీడీ సప్తగిరి పత్రికతోపాటు అన్యమత సువార్త పుస్తకం ఈనెల 6న పోస్టులో వచ్చిందని ప్రచారం జరిగింది. దీనిపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి.

దీనిపై ప్రభుత్వం, టీటీడీ సీరియస్ అయ్యింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. తిరుపతి పోలీసులు గుంటూరుకు చేరుకొని మల్లికార్జునపేటలోని సప్తగిరి పత్రిక చందాదారుడు విష్ణు నివాసంలో విచారణ చేశారు. సప్తగిరి పత్రికతో అన్యమత ప్రచార పుస్తకం పోస్టులో వచ్చినట్టు విష్ణు తెలిపాడు.

దీనిపై పోస్ట్ మ్యాన్ ను కూడా విచారించడానికి పోలీసులు చెబుతున్నారు. పూర్తి విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఈ వివాదంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సప్తగిరి పత్రికతోపాటు అన్యమత పుస్తకం పంపామన్నది శుద్ధ అబద్ధమని ఆయన పేర్కొన్నాడు. దీనివెనుక కుట్రను బయటపెడుతామని.. విచారణ జరిపిస్తామని తెలిపారు.


Tags:    

Similar News