పాక్ క్రికెట్ కెప్టెన్ కామెడీ పాల‌య్యాడు

Update: 2017-06-14 11:32 GMT
చాంపియ‌న్స్ ట్రోఫీలో పాకిస్థాన్ సెమీఫైన‌ల్ చేరినా ఆ టీమ్ కెప్టెన్ స‌ర్ఫరాజ్ అహ్మ‌ద్‌ కు క‌ష్టాలు మాత్రం తీర‌లేదు. శ్రీలంక‌తో మ్యాచ్‌ లో చివ‌రిదాకా క్రీజులో ఉండి పాక్‌ ను గెలిపించిన స‌ర్ఫ‌రాజ్‌ కు క‌ష్టాలేంటి అనేగా మీ డౌట్‌. అత‌నికి వ‌చ్చిన క‌ష్టం ఫీల్డ్ లోపల కాదు.. ఫీల్డ్ బ‌య‌ట‌. అది భాష‌తో వ‌చ్చిన క‌ష్టం. ఆడుతున్న‌ది ఇంగ్లండ్‌ లో క‌దా.. ఎటు చూసినా ఇంగ్లిషే. కానీ మ‌నోడి ఇంగ్లిష్ అంతంత మాత్ర‌మే. మ్యాచ్ అయిపోయిన త‌ర్వాత ప్రెజెంటేష‌న్ సెర్మ‌నీలో ఏం మాట్లాడాలో అన్న టెన్ష‌న్. తాజాగా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ కు వ‌చ్చాడు స‌ర్ఫ‌రాజ్‌. రాగానే అత‌ని గుండె జ‌ల్లుమంది. అక్క‌డున్న రిపోర్ట‌ర్లంతా ఇంగ్లిష్ వాళ్లే. ఇదే విష‌యాన్ని అత‌ను పీఆర్‌ వోను అడ‌గ‌డం వీడియోలో స్ప‌ష్టంగా వినిపించింది. ప్రెస్ కాన్ఫ‌రెన్స్ మొద‌ల‌య్యే ముందే అత‌ను ఈ విష‌యాన్ని అడిగి తెలుసుకున్నాడు. అంద‌రూ వాళ్లేన‌ని చెప్ప‌డంతో స‌ర్ఫ‌రాజ్ ఉసూరుమ‌న్నాడు. అనంత‌రం ఎలాగోలా మేనేజ్ చేసేశారు.

ఇదిలాఉండ‌గా....చాంపియ‌న్స్ ట్రోఫీలో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి పాకిస్థాన్‌ ను సెమీస్‌ కు చేర్చిన ఆ టీమ్ కెప్టెన్ సర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌.. అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అయితే ఫీల్డింగ్ సంద‌ర్భంగా అత‌ను క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన తీరు మాత్రం నివ్వెర ప‌రుస్తోంది. శ్రీలంక ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఆమిర్ బౌలింగ్‌ లో స‌ర్ఫ‌రాజ్.. అసేల గుణ‌ర‌త్నె ఇచ్చిన క్యాచ్‌ ను స‌రిగా అందుకోలేక‌పోయాడు. మొద‌ట బంతి అత‌ని చేతుల్లో ప‌డినా.. త‌ర్వాత అది కింది ప‌డిపోయింది. ఈ విష‌యం అత‌నికి కూడా స్ప‌ష్టంగా తెలుసు. కానీ ఈ క్యాచ్‌ పై చ‌ర్చిస్తున్న అంపైర్ల వైపుగా వెళ్లి.. మూడో అంపైర్‌ కు రిఫ‌ర్ చేయాల‌ని అత‌ను సూచించాడు. ఆ త‌ర్వాత రీప్లేల్లో బాల్ కింద ప‌డిపోయిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపించింది. కింద ప‌డిన బంతిని తీసుకొని అత‌ను ఔట్ కోసం అప్పీల్ చేయ‌డం.. స‌ర్ఫ‌రాజ్‌ క్రీడాస్ఫూర్తి ఏంటో తెలియ‌జేస్తోంద‌ని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News