ఏపీ సీఎం జగన్‌కు మరో పెద్ద సవాలే వచ్చిపడిందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్ర ఖజానాతో ప్రభుత్వం మథన పడుతోంది. అయితే.. ఇప్పుడు మరో సమస్య జగన్‌కు వచ్చిపడింది. అంది కూడా సొంత పార్టీ నేతలు.. సర్పంచుల నుంచే కావడం గమనార్హం. అంతేకాదు.. రాజ్యంగ బద్ధమైన సమస్యగా కూడా మారనుంది. ఎవరైనా.. రేపు రెబల్ గా మారితే.. మళ్లీ న్యాయపోరాటంలో జగన్‌కు తలనొప్పులు తప్పవు అంటున్నారు పరిశీలకులు. కానీ.. దీనిని పరిష్కరించాలంటే.. ఇప్పటికిప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి! దీంతో జగన్‌కు ఈ సమస్య పెను భారంగా మారేలా కనిపిస్తోంది.
విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలో జగన్ హయాంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో .. సీఎం స్వయంగా ఒక స్పష్టమైన పిలుపు ఇచ్చారు.. ``రాజకీయాలెందుకు.. ఏకగీవ్రంగా సర్పంచ్‌లను ఎన్నుకోండి.. తద్వారా అందించే ప్రోత్సాహకాలతో గ్రామాలను అభివృద్ధి చేసుకోండి`` అని సందేశం పంపించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలు సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్నాయి. వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నాయి. ప్రోత్సాహక నగదుతో ప్రత్యేక అభివృద్ధి పనులు చేద్దామని నేతలు ప్రజలకు హామీ లిచ్చారు. దీంతో ప్రజలు కూడా మౌనంగా ఉన్నారు.
వైసీపీ నేతలు.. ఎక్కడికక్కడ పార్టీ రహితమే అయినా..త మవారికే సర్పంచ్ పదవులు దక్కేలా చక్రం తిప్పారు. ఇంతవరకుబాగానేఉన్నా.. ఇప్పుడు.. ఎన్నికలు ముగిసి.. వీరు ఎన్నికై.. ఆరు అవుతున్నా.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జనాభా ప్రాతిపదికన ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం అప్పట్లో ప్రత్యేకంగా జీవోను విడుదల చేసింది. ఆ ప్రకారం 2 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2 వేల నుంచి 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు, 5 వేల నుంచి 10 వేలలోపు జనాభా పంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేల జనాభా మించితే రూ.20 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.
అంతేకాదు.. చంద్రబాబు హయాంలో ఉన్న ప్రోత్సాహకాన్ని పెంచుతూ అనేక పంచాయతీలు ఏకగ్రీవం అయ్యేలా చేశారు. ఎన్నికల తంతు ముగిశాక ఆ ప్రకటనలు గాలిలో కలిసిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ ఏకగ్రీవ పంచాయతీలు.. వేలల్లో ఉన్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంది. అత్యధికంగా 2 వేలలోపు జనాభా పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికల తంతు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా ప్రోత్సాహకాలు అందలేదు. నేతలు, వార్డు మెంబర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. అంతేకాదు.. ప్రబుత్వానికి అర్జీలు ఇచ్చేందుకు కూడా వీరు రెడీ అవుతున్నారు. ఇక, వీరిలో ఎవరైనా.. రెబల్‌గా మారితే.. ఖచ్చితంగా న్యాయపోరాటానికి దిగితే.. జగన్‌కు ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.