ఒబామా కూతురి పేరు న‌టాషా!

Update: 2017-06-14 13:14 GMT
అమెరికా మాజీ అధ్యక్షడు బరాక్‌ ఒబామా చిన్న కూతురు సాషా ఒబామా తన 16వ పుట్టిన రోజును శ‌నివారం ఘనంగా జరుపుకున్నారు.ఇందులో పెద్ద వింతేమిటి అంటారా? సాషా  ఫస్ట్‌ నేమ్‌ నటాషా అని తెలిసి తాను ఏడాది క్రితం అమితాశ్చర్యానికి గురయ్యానని ఆశ్లే సీ ఫోర్డ్‌ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇంట‌ర్నెట్‌ లో వైర‌ల్‌ గా మారింది.  నెటిజ‌న్లంద‌రూ త‌మ‌దైన రీతిలో వ్యంగ్యంగా స్పందించారు. వేలాది మంది నటాషా పేరును షేర్‌ చేసుకున్నారు.

‘సాషా పేరు నటాషా అని తెలియ‌కుండా ఇంతకాలం బ‌తికాం’ అని కొందరు స్పందించారు. అమెరికా అధ్యక్షుల వెనక రష్యా కుట్ర ప‌న్నింద‌న‌డానికి నటాషా పేరే సాక్ష్యమని కొంద‌రు చ‌మ‌త్క‌రించారు. నటాషా పేరు రష్యన్లు ఎక్కువ మంది పెట్టుకుంటారని కొంద‌రు అన్నారు. ట్రంప్‌ విజయం వెనక రష్యా కుట్ర ఉందనే ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే.

సాషా అసలు పేరు నటాషా అయితే ఒబామా పెద్ద కూతురు మాలియా అసలు పేరు చెల్సియానా? అంటు కొందరు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. మరికొందరు మారియా అసలు పేరు బోరిస్‌ అంటూ ఫిక్స్ అయ్యారు. సాషా పూర్తి పేరు సాషా అకా నటాషా ఒబామా. ఆమె పూర్తి పేరు అంద‌రికీ తెలియ‌దు. మార్తాస్‌ వైన్‌ యార్డ్‌ దీవిలోని ఓ రెస్టారెంట్‌ లో గత వేసవిలో సాషా పనిచేసినప్పుడు ఆమె పూర్తిపేరు మొదటిసారి వెలుగులోకి వ‌చ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News