జల్లికట్టు కోసం తమిళనాడులో జరుగుతున్న ఉద్యమం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ప్రజా ఉద్యమంగా కనిపిస్తున్నప్పటికీ ఇటీవల కొన్ని సంఘటనలను చూస్తుంటే దీని వెనుక పెద్ద శక్తులు ఉన్నాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీఎం పదవికి ప్రయత్నిస్తున్న అన్నాడీఎంకే చీఫ్ శశికళ పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు.
తొలుత చిన్నగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం క్రమంగా పుంజుకోవడానికి 'చిన్నమ్మ' సహకారమే కారణమని చెబుతున్నారు. ప్రధాని మోడీపై ఉన్న ఆగ్రహం, జల్లికట్టు సాధించుకోవాలన్న కసితోనే ఆమె సహకారం అందించారని అంటున్నారు. అంతేకాదు, ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లడంలోనూ ఆమె పాత్ర ఉందంటున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున పైకెగసిన తర్వాత శశికళ స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనను విరమింపజేసి ఆ క్రెడిట్‌ను తాను కొట్టేయాలని శశికళ భావించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఉద్యమకారులకు నీళ్లు, ఆహారం అందించింది కూడా శశికళ వర్గీయులేనని అంటున్నారు. వాహనాలు వంటి పోలీసులే తగలబెట్టినట్లు, రాళ్లు రువ్వినట్లు కనిపిస్తున్న దృశ్యాలు వీటికి ఊతమిస్తున్నాయి. జయకు నెచ్చలిగా తమిళనాడు అధికార వర్గాలను ఇంతకాలం తన చెప్పు చేతల్లో ఉంచుకున్న ఆమె తన అనుకూలమైన పోలీసులతో ఇలాంటి చేయించినట్లు అనుమానిస్తున్నారు.
అయితే ఆందోళనకారుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో పరిస్థితి శశికళ చేయి దాటిపోయింది. జల్లికట్టు క్రీడ నిర్వహణకు వీలుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చాం కాబట్టి ఆందోళనను విరమించాలంటూ ఆమె పంపిన సందేశాన్ని నిరసనకారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహంచిన శశికళ, అప్పటి వరకు అన్ని రకాలుగా అందించిన సహకారాన్ని ఆపేశారని టాక్. ఉద్యమ వేడిని పెంచి.. దాన్ని చల్లార్చాలనుకున్నా.. చల్లార్చడం చేతకాకపోవడంతో ఆమె సీను నుంచి తప్పుకున్నారనటి తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/