అదేందో తమిళనాడులో రాజకీయం మరీ తేలికైపోయింది. ఏదో వ్యాపారం స్టార్ట్ చేసినంత సింఫుల్ గా తమిళనాడులో కొత్త రాజకీయపార్టీల్ని పెట్టేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరిగా పెడుతున్నకొత్త పార్టీలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొత్త పార్టీల్లో ఉండేవి ఎన్ని.. పోయేవి ఎన్ని? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
"అమ్మ" జయలలిత మరణం తర్వాత కొత్త పార్టీల జోరు అంతకంతకూ పెరిగిపోతోంది. అమ్మకు నెచ్చెలిగా సుపరిచితురాలు.. చిన్నమ్మగా అందరూ పిలుచుకునే శశికళ అన్నాడీఎంకేలో చక్రం తిప్పే ప్రయత్నం చేసి భంగపడటం తెలిసిందే. ఆమె మేనల్లుడు దినకరన్ (అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం) పేరుతో కొత్త పార్టీ పెట్టటం తెలిసిందే. ఇక.. అమ్మ మేనకోడలు అల్రెడీ పార్టీ పెట్టేశారు. వీరు సరిపోనట్లుగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ సొంత పార్టీని ప్రకటించగా.. ఆ బాటలో మరో ప్రముఖ నటుడు రజనీకాంత్ ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆయనో రాజకీయ పార్టీని ప్రకటిస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా చిన్నమ్మ సోదరుడు దివాకరన్ కూడా కొత్త పార్టీ పెట్టేశారు. అన్నా ద్రవిడార్ కజగమ్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. నలుపు.. ఎరుపు రంగుల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొత్త పార్టీలో తాను జనరల్ సెక్రటరీగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన సోదరుడు రాజకీయ పార్టీ పెట్టటంపై శశికళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన సోదరుడు తన పేరును వాడుకుంటున్నట్లుగా ఆమె లీగల్ నోటీసులు పంపనున్నారు. దీంతో.. ఈ వివాదం మరింత ముదిరి శశికళను ఇకపై అక్క అని పిలవనంటూ ప్రకటించారు. కొత్త పార్టీ సంగతేమో కానీ.. చిన్నమ్మ ఇంట్లో కలహాలు అంతకంతకూ ముదురుతున్నాయన్న మాట వినిపిస్తోంది.