సుప్రీంకోర్టు తీర్పుతో షాకైన శశికళ తీవ్ర ఆవేదనకు లోనయ్యారట. ఆమెను కన్నీటిని ఆపడం ఎవరి తరం కావడం లేదట. తీర్పు వెలువడగానే చాలాసేపు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయినట్టు తెలుస్తోంది. ఆ తరువాత కొందరు ముఖ్య నేతల ఓదార్పుతో తేరుకుని తన నిర్ణయం ప్రకటించినట్లుగా చెబుతున్నారు.
తానికి ఆలస్యం చేయబోనని.. ఇప్పటికిప్పుడు లొంగిపోయి, రిసార్టు నుంచి నేరుగా జైలుకు వెళతానని అన్నాడీఎంకే నేతలతో చెప్పినట్టు తెలుస్తోంది. ఆమెను వారించేందుకు నేతలు ప్రయత్నించినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదని చెబుతున్నారు.
మరోవైపు తీర్పు నేపథ్యంలో శశికళ శిబిరంలోని నేతలు వెంటనే జాగ్రత్త పడిపోయారు. పోలీసుల రాకతో నిర్బంధం వీడి అంతా ఫ్రీ అవడంతో వెంటనే పన్నీర్ వర్గంతో టచ్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. శశికళ ఇక నేరుగా జైలుకే వెళ్లనుండటంతో... పన్నీర్ కు జై కొట్టడమే మేలనే ఆలోచనలో వారు ఉన్నారు. శశి వర్గం నుంచి మరో వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజలు వారికి మద్దతు ప్రకటించే అవకాశం ఎంత మాత్రం లేకపోవడంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పన్నీర్ వైపు వెళ్తున్నారు. పన్నీర్ చెంతకు చేరితే, ప్రజలు మద్దతును పొందవచ్చనే ఆలోచనలో శశి వర్గీయులు ఉన్నట్టు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/