తమిళనాడంతా జయలలితలే..

Update: 2017-01-07 07:00 GMT
తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. దివంగత సీఎం జయలలిత మృతి తరువాత అక్కడ రాజకీయాధికారం కోసం పోరాటాలు మొదలయ్యాయి. అమ్మ జయలలిత స్థానంలో కొత్త అమ్మగా ప్రతిష్ఠాపితం అయ్యేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. జయ నెచ్చెలి శశికళ ఈ విషయంలో ముందుండగా జయ మేనకోడలు కూడా గట్టి పట్టే పడుతున్నారు. అయితే శశికళ మాత్రం పూర్తిగా జయను అనుకరిస్తూ క్యాడర్ లో పట్టుపెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
    
అమ్మ‌ను అనుక‌రించే ప‌ని మాత్రం శ‌శిక‌ళ పూర్తిస్థాయిలో చేప‌ట్టారు.  జ‌య‌ల‌లిత త‌ర్వాత తానే అమ్మ అని.. దీన్ని అంద‌రూ అంగీక‌రించి తీరాల్సిందేన‌ని  శ‌శిక‌ళ ప‌ట్టుప‌డుతున్నారు. ఆమె వైపుకు అన్నాడిఎంకె వ‌ర్గాలు మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. జ‌య‌ల‌లిత అధికార‌ గృహంలో శ‌శిక‌ళ తిష్ట‌వేసుకొని కూర్చున్నారు. అక్క‌డ నుంచి క‌ద‌ల‌కుండానే రాజకీయ‌చ‌క్రం తిప్పుతున్నారు.
    
అన్నాడిఎంకె కార్య‌కర్త‌ల్లో ఇటీవ‌ల ఆడ‌పిల్ల‌ల‌ను క‌న్న‌వారిని ఆ బిడ్డ‌తో స‌హా తాను ఉంటున్న పోయిస్ గార్డెన్ కు  ర‌ప్పించుకొంటున్నారు. అచ్చం జయలలితలాగే  శ‌శిక‌ళ ఆ ప‌సిబిడ్డ‌ల‌ను చేతిలోకి తీసుకొని ,ముద్దాడి జ‌య‌ల‌లిత అని నామ‌క‌ర‌ణం చేసి, విలువైన బ‌హుమ‌తి కూడా ఇచ్చి పంపుతున్నారు. జ‌య‌ల‌లిత‌ను ఇమిటేట్ చేసేలా ఈ సీన్ ఉంటోంది. జ‌య‌ల‌లిత లేని లోటు ఎవరికీ ఉండ‌నీయ‌న‌ని - అంతా అమ్మ‌లాగే చేస్తాన‌ని సంకేతాలు ఇస్తున్నారు. గ‌తంలో ఎంజీఆర్ చ‌నిపోయిన త‌ర్వాత అబ్బాయిల‌ను క‌న్న క్యాడ‌ర్ని పిలిపించుకొన్న జ‌య‌ల‌లిత ఆ అబ్బాయిలకు రామ‌చంద్ర‌న్ అని పేరు పెట్టి క్యాడ‌ర్‌ లో పేరు సంపాదించారు. ఇపుడు శ‌శిక‌ళ కూడా అదే పనిచేస్తున్నారు.  మొత్తం మీద జ‌య‌ల‌లిత పాత్ర‌ను పోషించి, ముఖ్య‌మంత్రి పీఠం ఎక్క‌డ‌మే ఆమె నెక్స్ట్ టార్గెట్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News