వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతుండగా ఇప్పుడే తమిళనాడులో రాజకీయాలు మొదలయ్యాయి. తొలిసారి జయలలిత, కరుణానిధి లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలపై ఇప్పటి నుంచే పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఓ బీజేపీ నాయకుడు చేసిన ట్వీట్ ఒక్కసారిగా రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. త్వరలోనే జైలు నుంచి మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ విడుదల కానున్నారట.
వచ్చేనెల 14వ తేదీన జైలు నుంచి శశికళ విడుదల కాబోతున్నారంటూ తమిళనాడుకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆశీర్వాదం ఆచారి ట్వీట్ చేశారు. దీంతో రాజకీయాల్లో ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది. అందరి దృష్టి ఇప్పుడు శశికళపై పడింది.
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ విడుదల కాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఆమె విడుదల సమాచారాన్ని ఓ బీజేపీ నాయకుడు తెలపడం వాస్తవమేనని తెలుస్తోంది. ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గడువు కంటే ముందే ఆమెను విడుదల చేస్తున్నారని చర్చ నడుస్తోంది.
2016 ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి జయలలిత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ముఖ్యమంత్రిగా జయలలిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఆమె మృతితో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ తర్వాత ఎన్నో కుట్రలు జరిగాయి. వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా శశికళ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలా జరిగితే రాజకీయాలు ఎలా అవుతాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో శశికళను పక్కకు నెట్టేశారు. తర్వాత ఇతరులను సీఎం కుర్చీలో కూర్చున్నారు. కుట్రలతో శశికళను జైలు పాలయ్యేలా చేశారు.
అక్రమాస్తుల కేసులో 2017లోశశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. 2017 ఫిబ్రవరిలో ఆమె జైలుకు వెళ్లారు. ప్రస్తుతం ఆమె కర్నాటకలోని బెంగళూరు పరప్పన అగ్రహారలోని కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలో శశికళ విడుదల అవుతారంటూ బీజేపీ నాయకుడు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆమె వస్తే ఒక్కసారిగా తమిళ రాజకీయాలు మారనున్నాయి. ఆమె లేకుండా రాజకీయాలు సాగాలని అధికార.. ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. ఆమె విడుదల తర్వాత ఏమవుతుందో వేచి చూడాలి. 2021లో తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.