వేలాది కోట్ల ఆస్తులు ఉన్నా.. న్యాయబద్ధంగా వాటిని సంపాదించకపోతే చివరకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న దానికి చిన్నమ్మ శశికళ ఉదంతం ఒకపెద్ద ఉదాహరణగా చెప్పాలి. మొన్నటి వరకూ రాజప్రసాదం లాంటి వేద నిలయంలో దర్జాగా గడిపిన శశికళ.. ఈ రోజు జైల్లో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. భారీఎత్తున ఆస్తులు.. అంతకు మించి అధికారం చేతిలో ఉన్నా.. చివరకు చిప్పకూడు తినాల్సిన దుస్థితి చూస్తే.. తప్పు ఎప్పటికైనా తప్పే. నేరం చేసిన వారు ఎవరైనా.. ఎంతటి వారైనా.. శిక్ష అనుభవించక తప్పదన్న భావం కలగటం ఖాయం.
భారీ ఎత్తున పరిశ్రమలు..కంపెనీలు.. వేలాది కోట్ల రూపాయిల ఆస్తులున్న శశికళ.. చివరకూ జైలుకు వెళ్లక తప్పలేదు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో పరప్పనఅగ్రహాన జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. వెంటనే ఆమెను జైలుకు తరలించారు. తనను ప్రత్యేక ఖైదీగా చూడాలంటూ శశి కోరినప్పటికీ.. న్యాయమూర్తి మాత్రం అందుకు నో చెప్పేశారు. ఆమెను సాధారణ ఖైదీ మాదిరే ట్రీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అక్రమాస్తుల కేసులో శశితోపాటు.. ఇళవరసి.. సుధాకరన్ లు కూడా జైలుశిక్షకు గురయ్యారు. శశి.. ఇళవరసిలను ఒకే గదిని కేటాయించారు. జైలు జీవితాన్ని ప్రారంభిస్తున్న శశికి జైలు అధికారులు మూడునీలిరంగు చీరలు.. ఒక ప్లేటు.. ఒక చెంబు.. ఒక గ్లాసు.. ఒక కంబళి.. దిండు.. దుప్పటి ఇచ్చారు. ప్రతి రోజూ మామూలు భోజనం.. శుక్రవారం మాత్రం మాంసాహారాన్ని ఇవ్వనున్నారు. జైలుకు వెళ్లటానికి ముందు వరకూ గంభీరంగా ఉంటూ.. ఆగ్రహంతో ఉన్నట్లు కనిపించిన శశి.. జైల్లోకి అడుగుపెట్టిన వెంటనే నవ్వుతూ ఉన్న దృశ్యాలు బయటకు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. ప్రత్యేక వసతుల కోసం న్యాయమూర్తిని అభ్యర్ధించినప్పటికీ నో అన్నా.. జైలు ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లి.. వసతులు పొందొచ్చన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. పరప్పన అగ్రహార కోర్టులో శశికళ ఎక్కువ కాలం ఉండకపోవచ్చని చెబుతున్నారు. కర్ణాటక నుంచి తమిళనాడు జైలుకు మారేలా ప్రయత్నాలు చేయనున్నట్లుగా చెబుతున్నారు. దీనికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుంది. అక్రమాస్తుల కేసు దాఖలైంది తమిళనాడులో కాబట్టి.. చెన్నైలోని పుళల్ జైలుకు లేదంటే మరో జైలుకు మార్చేందుకు వీలుగా శశికళ ప్రయత్నాల్ని మొదలెట్టినట్లుగా చెబుతున్నారు. మరి.. దీనిపై న్యాయమూర్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/