ఆశ్చర్యానికి గురి చేసేలా మోడీకి చిన్నమ్మ లేఖ

Update: 2017-02-07 15:22 GMT
అడుగు దూరానికి వచ్చిన ముఖ్యమంత్రి పదవి ఆగిపోతే ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. కానీ.. చిన్నమ్మ మాత్రం తనకు అలాంటివేమీ లేదన్నట్లుగా వ్యవహరించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోజు వ్యవధిలో మొత్తం మారిపోవటం.. నిన్నటి వరకూ తన వంక చూసేందుకు సాహసించని వారుసైతం.. నేడు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారన్న సమాచారం అందుతున్నా.. చిన్నమ్మ మాత్రం తనలోని నిబ్బరాన్ని ఏమాత్రం కోల్పోలేదు.

సమస్యలు వచ్చినప్పుడు మరింత కరకుగా మారటం.. తనను వ్యతిరేకించే వారిని చూసి ఆందోళన చెందకుండా.. అసలా విషయాలేమీ తనకు పట్టవన్నట్లుగా ఆమె వ్యవహరిస్తున్న ధోరణి ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తోంది. అంతా తనను వేలెత్తి చూపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నవేళ.. చిన్నమ్మ ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవటం ఖాయం.

ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అర్హత ఏమాత్రం లేదంటూ పలువురు తిట్టిపోస్తున్న వేళ.. చిన్నమ్మ ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ఇందులో ఏం ఉందన్న విషయాన్ని చూస్తే.. చిన్నమ్మ రాజకీయ చతురత ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది. అందరూ అన్ని మర్చిపోయి.. చిన్నమ్మే టార్గెట్ గా మారిపోయిన వేళ.. ఆమె మాత్రం అందుకు భిన్నంగా శ్రీలంక అదుపులోకి తీసుకున్న 35 మంది తమిళ మత్స్యకారుల్ని.. వారి 120 పడవల్ని వెంటనే విడిపించేలా చర్యలు తీసుకోవాలని.. అందుకు ప్రధాని తక్షణమే స్పందించాలని డిమాండ్ చేయటం గమనార్హం.

అమ్మ మరణం తర్వాత జల్లికట్టు మీద నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి లేఖ రాసిన చిన్నమ్మ.. తమిళ మత్స్యకారుల్ని విడుదల చేసేలా చొరవ ప్రదర్శించాలంటూ మోడీకి తాజా లేఖ రాశారు. నిజానికి ఇలాంటి అంశాల మీద అలెర్ట్ గా ఉండాల్సిన విపక్ష నేత.. శశికళను టార్గెట్ చేస్తూ.. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు ప్రధాని మోడీని కలుసుకునే ప్రయత్నం చేస్తుంటే.. చిన్నమ్మ మాత్రం కూల్ గా తమిళ మత్స్యకారుల సమస్యను తీర్చాలంటూ ప్రధానికి లేఖ రాయటం చూస్తే.. ఆమెను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదన్న భావన కలగటం ఖాయం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News