చిన్నమ్మ ఆకాశం మీద నుంచి ఊడిపడ్డారా?

Update: 2017-02-05 10:03 GMT
తమిళనాడు రాజకీయాలు కాస్త చిత్రంగా ఉంటాయి. మర్యాద కోసం మిగిలిన నేతలు వ్యవహరించే తీరుకు భిన్నంగా వ్యవహరించే ధోరణి అప్పట్లో అమ్మలో కనిపిస్తే.. ఇప్పుడు అంతకు మించిన అన్నట్లుగా చిన్నమ్మలోనూ కనిపిస్తుంది. ప్రజాజీవితంలో ఉండేవారు.. తమను కలిసే వారిని.. తమతో ఫోటోలు దిగే వారి విషయంలో కాస్త నేర్పుగా వ్యవహరించటం కనిపిస్తుంది.

చిన్నపిల్లలు ఎవరైనా దగ్గరకు వస్తే.. వారిని ముద్దు చేయటం.. ఎత్తుకోవటం.. దగ్గరకు తీసుకోవటం లాంటివి చేస్తుంటారు. తాజాగా అన్నాడీఎంకే అధినేత్రిగా వ్యవహరిస్తున్న చిన్నమ్మ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం కనిపిస్తుంది. అమ్మ మరణం తర్వాత.. ఆమె తరహాలోనే కట్టుబొట్టును పూర్తిగా మార్చేసుకున్న చిన్నమ్మ.. తన పేరును పిలిచే వీల్లేకుండా చేసేశారు. జయను కానీ అమ్మ అని మాత్రమే వ్యవహరించేవారు. ఆమె బాటలోనే చిన్నమ్మ నడవటమే కాదు.. తన దగ్గరకు వచ్చే నేతల్ని అమ్మ తరహాలోనే డీల్ చేయటం కనిపిస్తుంది.

అమ్మకు.. చిన్నమ్మకు ఏదైనా తేడా ఉందంటే.. అమ్మ గంభీరంగా ఉంటే.. చిన్నమ్మ కాస్తంత నవ్వు ముఖం పెడుతుంటారు. అయితే.. చిన్నమ్మ దగ్గరకు ఎవరైనా నేతలు తమ పిల్లల్ని తీసుకొస్తే.. వారిని ముట్టుకోవటం తర్వాత సంగతి.. వారికి కాస్త దూరంగా ఉండి ఫోటోలు దిగే వైనం కనిపిస్తుంది. పిల్లలు తనకు దగ్గరకు వస్తుంటే.. ఒక అడుగుదూరం జరిగి నిలుచోవటం వీడియో క్లిప్పింగుల్లో స్పష్టం కనిపిస్తుంటుంది.ఇలాంటి వైఖరిని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. తమను తాము దేవతా సమానులుగా.. ఆకాశం నుంచి ఊడిపడ్డట్లుగా.. జనాల బతుకుల్ని మార్చేందుకే తాము పుట్టినట్లుగా వ్యవహరించే ధోరణి కనిపిస్తుంది. తాజాగా.. చిన్నమ్మ తీరు ఇదే తరహాలో ఉండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News