తమిళనాడులో పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని ఒక రాజ్యసభ సభ్యురాలి వ్యవహారం ఇప్పుడు చర్చగా మారటమే కాదు.. ఆమెకు చెందిన వార్తలు మీడియాలో ప్రముఖంగా వస్తున్న పరిస్థితి. తన అధినాయకురాలు.. అందరి చేత ‘అమ్మ’గా పిలిపించుకునే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై సదరు ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కలలోసైతం ‘అమ్మ’ను పల్లెత్తు మాట అనటానికి సైతం జంకే అన్నాడీఎంకే నేతల తీరుకు భిన్నంగా ఆ పార్టీ ఎంపీ శశికళ పుష్ప.. రాజ్యసభలోనే అమ్మ ప్రస్తావన తీసుకురావటం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఆమె మీద తీవ్ర ఆరోపణలు చేయటం గమనార్హం.
డీఎంకే పార్టీ ఎంపీ తిరుచ్చిశివను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చెంప ఛెళ్లుమనిపించిన ఉదంతంతో తెర మీదకు వచ్చిన శశికళ ఉదంతంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీడియాలో ప్రముఖంగా వచ్చిన చెంపదెబ్బ వార్తతో.. ఈ విషయం మీద అమ్మ ఫోకస్ పెట్టటం.. చెంప దెబ్బ కొట్టిన తిరుచ్చి శివతో శశికళకు సన్నిహిత సంబంధాలు ఉండటం అమ్మకు చిరాగ్గా అనిపించిందట. ప్రత్యర్థి పార్టీ ఎంపీతో ఫ్రెండ్ షిప్ ఏమిటని సీరియస్ అయిన అమ్మ.. శశికళను రాజీనామా చేయమన్నట్లుగా అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. సోమవారం రాజ్యసభలో ఎంపీ శశికళ రోదిస్తూ.. తమ అధినేత్రిపై తీవ్ర ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. 2020 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా ఉండేందుకు అవకాశం ఉన్న శశికళ.. తనను రాజీనామా చేయాలని బలవంతంగా చేస్తున్నారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. జరగనున్నది ఏమిటన్నది అర్థం చేసుకున్న వెంకయ్య వెంటనే ఈ ఉదంతంలో కలుగజేసుకొని..సభలో లేని వారిపై వ్యాఖ్యలు చేయటం సరికాదని.. ఈ ఇష్యూను అక్కడితో క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే.. రాజకీయంగా తమకు కలిసొచ్చే వ్యవహారం కావటంతో ఈ ఇష్యూలోకి ఎంటర్ అయిన కాంగ్రెస్.. డీఎంకే నేతలు.. శశికళను మాట్లాడానివ్వాలని.. ఆమె చెప్పేది వినాల్సిన అవసరం ఉందంటూ ఆమెకు మద్ధతు పలికారు.
జయలలితపై ఆరోపణలు చేసిన శశికళ.. ఆమె తనను చెంపదెబ్బ కొట్టారన్నారు. తనకు ప్రాణహాని ఉందని.. తనకు అదనపు భద్రత కల్పించాలంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. తూత్తుకూడి పట్టణంలో సాధారణకార్యకర్తగా ఉన్న శశికళను జయలలిత పెద్దపీట వేస్తూ.. పార్టీ మహిళా విభాగ కార్యదర్శిగా ఎంపిక చేయటమేకాదు.. ఆమెను 2014లో రాజ్యసభకు పంపారు. కొన్ని ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది మహిళా విభాగ కార్యదర్శిగా శశికళను పదవి నుంచి తప్పించిన జయలలిత.. తాజాగా చోటు చేసుకున్నపరిణామాల నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి తొలగించినట్లుగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. ఆమె సీఎం జయలలిత మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఢిల్లీకి రావటానికి ముందు ‘అమ్మ’ తన ఇంటికి పిలిపించారని.. పోయెస్ గార్డెన్ లో తనను కుక్కలా గదిలో నిర్బంధించారని.. తన పదవికి రాజీనామా చేయాలని చెప్పారన్నారు. తన ఫోన్ ను కూడా తీసుకున్నారని..కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వలేదన్న ఆమె.. ఇంతకీ డీఎంకే ఎంపీని ఎయిర్ పోర్ట్ లో ఎందుకు చెంపదెబ్బ కొట్టారన్న విషయం మీద సంతృప్తికర సమాధానం ఇవ్వకపోవటం గమనార్హం. ప్రత్యర్థి పార్టీ ఎంపీ చెంప ఛెళ్లుమనిపించిన శశికళ.. తాజాగా తనకు పదవినిచ్చిన అమ్మే తనను చెంప దెబ్బ కొట్టినట్లుగా ఆరోపణలు చేయటం విశేషం. మరీ.. వివాదం ఎక్కడివరకూ వెళుతుందో చూడాలి.