సంచలనంగా మారిన ‘శశికళ’ బాంబు

Update: 2016-10-10 16:10 GMT
తమిళనాడులో ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగానే కాదు.. సంచలనంగా మారాయి. నిన్న మొన్నటి వరకూ నోరు విప్పేందుకు సైతం జంకిన మహిళా ఎంపీ ఇప్పుడు సంచలనంగా మారారు. ఆమె తెరపైకి తీసుకొచ్చిన అంశంపై భారీ ఎత్తున చర్చ జరగటమే కాదు.. కొత్త కలకలాన్ని రేపుతుందనటంలో సందేహం లేదు. అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ చేసిన ఆరోపణ ఇప్పుడు తమిళనాట పెను సంచలనంగా మారింది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న వేళ.. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె నోటి నుంచి వచ్చిన బాంబు లాంటి మాట ఇప్పుడక్కడి రాజకీయవర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ముఖ్యమంత్రికి దగ్గరే ఉన్న కొందరు వ్యక్తులు అంటూ అమ్మకు సన్నిహితంగా ఉండే.. ఆమె స్నేహితురాలు ‘శశికళ’ను టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత సంతకాన్నిఫోర్జరీ చేసి.. అన్నాడీఎంకే పార్టీకి ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీని నియమించాలని అనుకుంటున్నారంటూ తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు ఒక లేఖ రాశారు.

‘‘ప్రభుత్వాన్ని నడిపేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారు. జయలలిత నుంచి అధికారికంగా ఏదైనా లేఖ వస్తే అందులో ఆమె సంతకాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా తనిఖీ చేయాలి. విషయం ఏదైనా జయలలిత సంతకంతో వచ్చే వాటన్నింటిని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’’ అని రాజ్యసభ సభ్యులురాలైన శశిశకళ కోరుతున్నారు. ఓపక్క.. అమ్మ సన్నిహితురాలైన శశికళ అన్నాడీఎంకే పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషించేందుకు వీలుగా పావులు కదుపుతున్నారన్న అనధికారిక సమాచారం వస్తున్న వేళ..  పార్టీ బహిష్కరించిన ఎంపీ శశికళ పేల్చిన బాంబు లాంటి మాట గవర్నర్ ఎంతమేర అలెర్ట్ గా ఉంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News