తమిళనాడులో అధికార అన్నాడీఎంకే నేతలంతా విలీన ఎపిసోడ్‌లో బిజీ బిజీగా ఉండగా...బహిష్కరణకు గురైన చిన్నమ్మ శశికళ మాత్రం తన జైలు జీవితాన్ని నూతన అవకాశాల వేదికగా మార్చుకుంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ అన్నాడీఎంకే రాజకీయాలను లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. జైల్లో ఉన్న సమయంలో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు శశికళ ఆసక్తి చూపున్నారట. ఈ విషయాన్ని జైలు అధికారులకు తెలియజేయగా వారు పరిశీలిస్తున్నారని సమాచారం.
పూర్తిగా తమిళ విద్యాభ్యాస నేపథ్యం ఉన్న శశికళకు మాతృభాష అయిన తమిళంపై పట్టుంది కానీ ఆంగ్లం విషయంలో ఆమె పరిజ్ఞానం తక్కువే. జైల్లో ఉన్నంతవరకు సమయాన్ని వృథా చేయకుండా ఆంగ్లం నేర్చుకునేందుకు శశికళ సిద్ధమయ్యారని సమాచారం. మరోవైపు తన ఆత్మకథను రాసే ప్రయత్నాలను శశికళ ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఆంగ్ల అభ్యసనానికి అనుమతి దక్కేవరకు ఆత్మకథ రాయనున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/