దేవ భూమిగా పేరుగాంచిన కేరళ.. వరదలకు ముందు ఎంతో అందంగా ఉండేది. ప్రకృతి సిద్ధ జలపాతాలు, అడవులు, కొండలు, కోనలు.. ఎటు చూసినా పిల్ల కాలువలు.. ప్రకృతి మొత్తం పోతపోసినట్టుండే కేరళను వానలు ముంచేశాయి. ఊరువాడ, గొడ్డు గోదా అంతా వరద ముంపులో కూరుకుపోయింది. కేరళ వరద తీవ్రతను కళ్లకు కట్టే వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో , మీడియాలో అందరినీ కదిలించాయి. అందుకే ఎంతో మంది కేరళను ఆదుకునేందుకు వస్తున్నారు..
తాజాగా కేరళ వరదలు ఎంతటి విపత్తును సృష్టించాయో కళ్లకు కట్టేలా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసిన చిత్రాలు ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. ఈ ఆదివారం కేరళలో వరద ముప్పు ఎంతటి ఉపద్రవాన్ని తెచ్చాయో సూచించాలే శాటిలైట్ ద్వారా ఈ చిత్రాలను నాసా శాస్త్రవేత్తలు తీశారు.
కేరళలోని అలపుజ్జా - కొట్టాయం - చంగనసేరి - తిరువెల్ల ప్రాంతాల చుట్టుపక్కల విస్తరించిన వేంబానంద్ డ్యాం పరిసరాల్లో తీసిన ఈ చిత్రాలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. ప్రకృతి విధ్వంసం ఎంత తీవ్రంగా కేరళలో జరిగిందో ఈ చిత్రాలు కళ్లకు కడుతున్నాయి.
నాసా విడుదల చేసిన రెండు చిత్రాల్లో ఒకటి ఫిబ్రవరి 6న వరదలకు ముందు ల్యాండ్ సెట్ అనే శాటిలైట్ తీసింది. అందులో ఎంతో పచ్చగా .. అడవులతో కేరళ చూడముచ్చటగా ఉంది. రెండోది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సెంటినైల్2 శాటిలైట్ తాజాగా ఆదివారం తీసింది. ఈ చిత్రంలో కేరళలోని సగం రాష్ట్రం నీటిలో మునిగిపోయినట్టు కనపడుతోంది. కేరళలో వరదల తీవ్రత ఎంత ఉందో ఈ శాటిలైట్ చిత్రం ద్వారా అవగతమవుతోంది.