మరీ ఇంత జోకుడా.. అర్నబ్ 'బీజేపీ' స్వామీ.?

Update: 2018-10-11 07:24 GMT
అర్నబ్ గోస్వామీ.. సీనియర్ జర్నలిస్ట్.. రాత్రి 7 గంటలకు ఈయన నిర్వహించే చర్చల్లో పాల్గొనాలంటేనే రాజకీయ నాయకుల ప్యాంట్లు తడిసిపోతాయి. ఇదివరకూ ‘టైమ్స్ నౌ’ చానెల్ లో డిబేట్ నిర్వహిస్తూ ఫైర్ బ్రాండ్ జర్నలిస్ట్ గా దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించాడు. 2014 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీని ఇంటర్వ్యూ చేసి ఆయన్ను పూర్తిగా డిఫెన్స్ లో పడేసి కాంగ్రెస్ ఓటమిలో అర్నబ్ కూడా ఓ కారణంగా కనిపించాడు. రాహుల్ ను పప్పుసుద్దను చేయడంలో ఈయన ఇంటర్వ్యూ బీజేపీకి బాగా ఉపయోగపడింది.

ఆ తర్వాత పరిణామాల్లో టైమ్స్ నౌ చానెల్ కు, అర్నబ్ గోస్వామికి విభేదాలొచ్చాయి. దీంతో బీజేపీ అండదండలతో ఏకంగా ‘రిపబ్లికన్ టీవీ’ పెట్టుకొని ఇప్పుడా చానెల్ కు అన్నీ తానై నిర్వహిస్తున్నాడు. బీజేపీపై ఒకింత అమితమైన ప్రేమను కనబరుస్తున్నాడు.  మీడియా వర్గాల్లో కూడా అర్నబ్ బీజేపీకి వంతపాడుతున్నాడన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి.

ఇటీవలే రిపబ్లిక్ టీవీ-సీఓటర్ అనే సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా ఎన్నికల సర్వే చేసింది. అత్తెసరు మెజార్టీతో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చింది. యూపీలో అఖిలేష్-బీఎస్సీ కలిసి గడిచిన ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాయి. అయినా కూడా అక్కడ బీజేపీనే గెలుస్తుందని రిపబ్లికన్ టీవీ ప్రకటించింది.

ఇక మరో విచిత్రమేంటంటే.. ఏపీలో బీజేపీకి 12.5శాతం ఓటు బ్యాంకుతో ఉనికి నిలుపుకుంటుందట... అస్సలు జనసేన ప్రభావమే ఏపీలో ఉండదని ఆ పార్టీకి ఒక్క సీటు రాదని ఈ సర్వే తేల్చింది. ఏపీలో ఇప్పుడున్న ప్రధానాస్త్రం ప్రత్యేకహోదా.. ఈ విషయంలో ఏపీని బీజేపీ దారుణంగా మోసపోయిందని జనమంతా ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ ఈ దెబ్బకు అధ: పాతాళానికి పడిపోయింది. కనీసం అభ్యర్థులు కూడా బీజేపీ తరఫున పోటీచేసేందుకు ఏపీలో సాహసించడం లేదు. ఈ నేపథ్యంలో ఏకంగా ఏపీలో బీజేపీ 12.5శాతం ఓటు హక్కును బీజేపీ సాధిస్తుందని అర్నబ్ టీవీ చానెల్ పేర్కొనడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

తాజాగా ఇంత చెత్త సర్వేను బయటపెట్టి.. బీజేపీకి అనుకూలంగా సర్వేను నిర్వహించిన జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. జనసేన పవన్ అభిమానులైతే.. తమకు సున్నామార్కులేసిన అర్నాబ్ ను ట్రోల్ చేస్తున్నారు. మిస్టర్ గోస్వామీ.. ఎంటీ ఈ జోకులు  అంటూ హ్యాష్ టాక్ తో ఎండగడుతున్నారు. తాజా సర్వే మీద కాంగ్రెస్, జనసేన, సమాజ్ వాదీ సహా అందరూ అర్నాబ్ ను జోకర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు.  
    

Tags:    

Similar News