టీడీపీ అధినేత - ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైపోయింది. ఫ్యామిలీతో కలిసి సేద దీరేందుకు గాను చంద్రబాబు ఈ నెల 7న విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయినా... ఆ టూర్ షెడ్యూల్ లోని ముఖ్యాంశాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉండిపోయాయి. ఈ టూర్ లో చంద్రబాబు ఏఏ దేశాల్లో పర్యటించనున్నారు? ఆయా దేశాల్లో ఆయన ఎన్ని రోజుల పాటు ఉంటారు? అన్న వివరాలేవీ ఇప్పటిదాకా బయటకే రాలేదు.
సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు టూర్ షెడ్యూల్ చాలా ముందుగానే రిలీజైపోయేది. అయితే ఇప్పుడు ఆయన సీఎం పదవి నుంచి దిగిపోయి.. విపక్ష నేతగా మారిపోయారు కదా. ఈ నేపథ్యంలో తన టూర్ షెడ్యూల్ పై చంద్రబాబు పెద్దగా స్పష్టత ఇవ్వలేదని చెబుతున్నారు. సరే... ఎలాగూ ఎన్నికలు ముగిశాయి. టీడీపీకి ఘోర పరాభవం తప్పలేదు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ తో పాటు పవన్ - టీడీపీలోని పలువురు నేతలు వెకేషన్ కు వెళ్లివచ్చారు. అయితే బాబు మాత్రం టూర్లను పక్కనపెట్టేసి సార్వత్రిక ఎన్నికల్లో భావసారూప్యం కలిగిన పార్టీలకు ప్రచారం పేరిట ఇక్కడే ఉండిపోయారు. తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడటంతో కేవలం 23 సీట్లను గెలుచుకున్న టీడీపీ అధికారం కోల్పోయింది. ఈ క్రమంలో టీడీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత బాబు ఫారిన్ టూర్ ప్లాన్ చేశారు.
అయితే ఈ టూర్ పై అప్పుడే సెటైర్లు మొదలైపోయాయి. చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాలన్నింటిపై విచారణ తప్పదని కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఫారిన్ టూర్ పేరిట విదేశాలకు వెళుతున్న చంద్రబాబు... ఇక తిరిగి వస్తారా? లేదంటే కేసులకు భయపడి అక్కడే ఉండిపోతారా? అంటూ సెటైర్లు మొదలైపోయాయి. టూర్ షెడ్యూల్ లో గోప్యతను పాటిస్తున్న వైనాన్ని కూడా ఈ సెటైర్లకు బలం చేకూరుస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.