ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు `ప్రచార`పాటవాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు.`గోబెల్స్`లో పీహెచ్ డీ చేసిన బాబు....ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో సిద్ధహస్తులు. తిమ్మిని బమ్మిని చేయడం....నందిని పంది అని నమ్మించడం `40 ఈయర్స్ ఇండస్ట్రీ` సీఎమ్ కు వెన్నతో పెట్టిన విద్య. గతంలో నానా బూతులు తిట్టిన కాంగ్రెస్ ను నేడు వేనోళ్ల పొగడడం బాబు వంటి ఘనాపాటికే సాధ్యం. తప్పులెన్ను వారు తమ తప్పులెన్నరు తరహాలో తాజాగా బాబు బండారం బట్టబయలయింది. గతంలో `అమరావతి` శంకుస్థాపన శిలా ఫలకంలో `తెలుగు`కు చోటివ్వని బాబు...నేడు `స్టాట్యూ ఆఫ్ యూనిటీ` ఫలకంలో `తెలుగు`కు చోటు దక్కలేదని తెగ బాధపడిపోవడం నిజంగా హాస్యాస్పదం. మరోవైపు, ఆ ఫలకంపై తెలుగు భాషలో `ఐక్య భారతం-శ్రేష్ఠ భారతం` అని రాసి ఉందన్న విషయాన్ని బాబు గారు గుర్తించకుండా ఫేక్ ఫొటో ఆధారంగా ఆవేశపడి ట్వీట్ చేయడం ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్.
`స్టాట్యూ ఆఫ్ యూనిటీ `ఫలకంలో `తెలుగు`కు చోటు దక్కలేదని - తమిళ భాషకు దక్కినా...తప్పుల తడక అని సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అయింది. టెక్నాలజీ అంటే మక్కువ ఎక్కువున్నచంద్రబాబు...ఆ ఫొటోను చెక్ చేయకుండానే వీరావేశంతో ట్వీట్ చేశారు. ``భారత దేశంలో ఎక్కువ మంది మాట్లాడే మూడవ అతి పెద్దదైన తెలుగు భాషకు #StatueOfUnity వద్ద గుర్తింపు లభించక పోవటంతో తెలుగు తల్లి బిడ్డగా నా మనసు క్షోభిస్తోంది. పైసా ఖర్చు లేని ఇటువంటి విషయాలలో కూడా తెలుగు వారంటే ఇంత వివక్షా?ప్రతి తెలుగు వారూ అలోచించి - తమ ఆవేదనను వ్యక్తం చేయవలసిన తరుణమిది``అని బాబు బాధాతప్త హృదయంతో ట్వీట్ చేశారు. అయితే, ఆ ఫొటో ఫేక్ అని...ఫలకంపై తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ రాసి ఉందని అధికారులు అసలు ఫొటోను పోస్ట్ చేశారు. కనీసం ఒరిజినల్ పోస్ట్ చూసిన తర్వాతైనా బాబు ...ఆ ఫేక్ పోస్టును డిలీట్ చేయలేదు.
దీంతో, చంద్రబాబుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు పొరపాటును ఎత్తిచూపుతోన్న నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ``మీది ప్రేమ...మాది వ్యామోహం...మీరు చేస్తే శృంగారం...మేము చేస్తే వ్యభిచారం....``అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ సీన్ లో పవన్ చెప్పిన డైలాగులను చంద్రబాబుకు నెటిజన్లు అప్లై చేస్తున్నారు. అమరావతి వ్యవహారంలో చంద్రబాబు తప్పు చేసినా....అది రైట్ అని...ఇపుడు వేరే వాళ్లు చేస్తే...బ్రహ్మాడం బద్దలయినట్లు బాబుగారు ఆవేశపడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయినా, చంద్రబాబుకు గురివింద తరహాలో తన తప్పులు కనిపించవని.....అసలు అది తప్పో కాదో చెక్ చేసుకునే టైం కూడా ఆయనకు లేదని చమత్కరిస్తున్నారు. పక్కనోళ్ల తప్పులు ఎత్తి చూపడంలో చంద్రబాబుకు సాటి చంద్రబాబే సాటి అని సెటైర్లు వేస్తున్నారు. పక్కోళ్ల తప్పుల మీద మైక్రోస్కోప్ వేసే చంద్రబాబు...తన తప్పుల మీద స్పెక్ట్స్ అయినా వేయాలని....జోకులు పేలుస్తున్నారు.