జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన సభకు పెద్ద ఎత్తున స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానుల సందోహంతో సభా ప్రాంగణం ఏ విధంగా నిండిపోయిందో....అభిప్రాయాలు పంచుకోవడంతో సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్ బుక్ వాల్ లు సైతం అదే విధంగా పోస్టింగ్ లు - కామెంట్లతో పోటెత్తాయి. పవన్ అభిమానులు కానివారంతా ఆయన స్పీచ్ ను విమర్శనాత్మకంగా విశ్లేషించడం ఈ అన్నింటిలోనూ సారంశం.
పవన్ పై విమర్శలతో ఏకంగా ఓ పుస్తకమే రాసిన బొగ్గుల శ్రీనివాస్ అయితే జనసేనాని తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన పోస్ట్ ఇలా ఉంది. "ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అంటారు గురజాడ- సభలో పవన్ కల్యాణ్ మాట ఇది- ఇంటర్మీడియట్ మూడు సార్లు రాసినా పాస్ కానోడిని పట్టుకుని రాయప్రోలు సుబ్బారావు ఎవరో ..గురజాడ అప్పారావు ఎవరో కరెక్ట్ గా చెప్తాడను కోవడం మన అవివేకమే..ఇంక ఆయనగారి చదువు ఇంటర్ ఫెయిల్ తో ఆగిపోయింది అంటూ కామెంట్ పెట్టారు. సందీప్ రెడ్డి కొత్తపల్లి అనే సోషల్ మీడియాలో చురుకైన తెలంగాణవాది "అమ్మా మాదాకోళం తల్లి...ఇది పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా "అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కు భారీగా స్పందన రావడం గమనార్హం. కేవీ కూర్మనాథ్ అనే సీనియర్ పాత్రికేయులు అయితే పవన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. "ఎంపీ అవంతి శ్రీనివాస్ రాజీనామాను మెచ్చుకున్న పవన్... కీలకమైన చంద్రబాబు రాజీనామా గురించి ఎందుకు ప్రస్తావించలేదు? అయినా అవంతి రాజీనామాతో ఏమొస్తుంది బోడి? " అంటూ సెటైర్ వేశారు.
మంచాల శ్రీనివాసరావు అనే వెటరన్ పాత్రికేయుడు ఒకరు పవన్ కామెంట్ ను యథాతథంగా ఆయన అభిమానులపై వదిలారు. తెలంగాణ ఏర్పడటంతో పదకొండు రోజుల పాటు భోజనం ముట్టలేదన్న పవన్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ...."తెలంగాణలోని పవన్ అభిమానుల్లారా వింటున్నారా మీ నాయకుడి మాటలు" అంటూ పవన్ ఫ్యాన్స్ ను కెలికారు. మొత్తంగా సోషల్ మీడియా అంతా పవన్ కామెంట్లతో నిండిపోవడం కనిపించింది.