జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులు వివిధ సమస్యలపై తన గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రస్తావించడం ద్వారా ఈ జోరును ఉధృతం చేసిన పవన్ అనంతరం అమరావతి రైతుల సమస్యలు - జల్లికట్టు-కోడి పందాలు - ఆ తదనంతరం ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించారు. వరుస ట్వీట్లతో జనసేనాని ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వంలోనూ కలకలం రేకెత్తిస్తున్నారు. అయితే పవన్ ట్వీట్లలో సమాచారం ఎంత ఉందో...తప్పులు కూడా అన్నే ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. కొన్ని గ్రూపుల్లో సదరు పోస్ట్‌లతో పంచ్ లు పేలుతున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జల్లికట్టుపై పవన్ స్పందించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పవన్ చేసిన ట్వీట్లతో ఆయన పార్టీ కార్యాలయం ప్రెస్ నోట్ విడుదల చేసింది. అందులో జల్లికట్టును నిషేధించడాన్ని తమిళులు వ్యతిరేకించారు అని ఉండాల్సింది పోయి...జల్లికట్టును వ్యతిరేకించారు అని పేర్కొన్నారు. ఇది కేవలం పదం తప్పు కాకుండా అర్థమే మారిపోతున్న నేపథ్యంలో కొందరు ఈ పొరపాటుపై సెటైర్లు పేల్చారు. ఇక పవన్ తాజా ట్వీట్ లో ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏపీ డిమాండ్స్ అనేది ఉండాల్సింది పోయి డి మ్యాడ్స్ అంటూ ఉంది. ఇందులో మిస్ అయింది ఒక్కటే పదం. కానీ ఆకాంక్ష కాస్త మ్యాడ్ అంటే పిచ్చి అనే భావనను కలిగించేలా చేరిందంటున్నారు.
పవన్ వంటి పెద్ద ఎత్తున ఫాలోయింగ్ కలిగి ఉన్న సిని - పొలిటికల్ స్టార్ కు సంబంధించిన పత్రిక ప్రకటనలు - ట్వీట్ల విషయంలో సంబంధిత వర్గాలు జాగ్రత్త వహించాల్సి ఉంటుందేమో !
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/