ఒక కీలక నేత నోటి నుంచి వచ్చే మాటలు చూపించే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కోట్లాది మందిని ప్రభావితం చేసే వ్యక్తుల మాటలకు మీడియా అమితంగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు కొందరు చెప్పే మాటలు ఎదురుతిరిగి మీదకే వస్తాయి. దీంతో.. మైలేజ్ సంగతి తర్వాత డ్యామేజ్ భారీగా వచ్చిపడే దుస్థితి. అందుకే.. కీలక నేతలు మాట్లాడే మాటలకు టైమింగ్ తో పాటు.. కంటెంట్ కూడా చాలా కీలకం.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కు ఇప్పుడు ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు. తన పేదరికం గురించి చెప్పానుకున్నారో.. సింపుల్ సిటీ గురించి చెప్పాలనుకున్నారో కానీ.. తన చిరిగిన కుర్తా ను ఆశేష ప్రజానీకానికి చూపిస్తూ.. ‘‘నా కుర్తా జేబు చినిగిపోయింది. అయినా నాకది పెద్ద విషయం కాదు. అయితే మోడీజీ చిరిగిన బట్టలు వేసుకోవటం మీరెప్పటికీ చూడలేరు. పేదల పక్షాన పోరాడుతున్నానని చెబుతూ ఆయన రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ ప్రధానిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు
అయితే.. ఈ ఎపిసోడ్ లో రాహుల్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పాలి. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై జనాలు ఏమనుకున్నారన్న విషయం సోషల్ మీడియాలో వెల్లువెత్తిన జోకులు చూస్తే ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. నెహ్రు.. గాంధీ కుటుంబానికి ఏకైక వారసుడైన రాహుల్ కు కుర్తాల కరువు రావటం ఏమిటని ఆసక్తిగా ప్రశ్నిస్తే.. కొత్త కుర్తా కొనుక్కోవటానికి డబ్బుల్లేవ్ కానీ.. ఫారిన్ టూర్లు తిరిగి రావటానికి డబ్బులున్నాయా? అంటూ ఏసుకున్నారు.
మరికొందరైతే..తలా రూపాయి వేసుకొని రాహుల్ కు కొత్త కుర్తా కొనిద్దామన్న క్యాంపైన్ షురూ చేశారు. ఇదిలా ఉంటే.. అన్నింటికి మించి హైలెట్ పంచ్ మాత్రం ఒకటి ఉంది. చిరిగిన కుర్తా వేసుకొని బహిరంగ సభకు వచ్చిన సందర్భంగా ఆయన ప్రయాణించిన ప్రత్యేక విమానం ఫోటోను ఒకరు షేర్ చేస్తూ.. చిరిగిన కుర్తాతో ప్రత్యేక విమానంలో జర్నీ చేయటం రాహుల్ కే చెల్లుతుందంటూ చేసిన ఎటకారం సూపర్ గా పేలటమే కాదు.. సరిగ్గా మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటావ్ రాహుల్ అనే సందేహం పలువురిలో కలిగేలా చేసింది. చిరిగిన కుర్తా.. రాహుల్ ఇమేజ్ ను మరింత చింపేసిందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/