నూడుల్స్ - టూత్ పేస్ట్ - నెయ్యి - తేనే - షాంపూ వంటి రకరకాల ఉత్పత్తులతో యోగా గురువు రాందేవ్ బాబా పంతజలి గ్రూప్ విదేశీ బ్రాండ్లకు గట్టిపోటీనే ఇస్తుంది. ఇలా తనదైన వ్యాపారాలతో దూసుకుపోతున్న రాందేవ్ బాబా.. తాజాగా వస్త్రరంగంలో అడుగుపెట్టి "స్వదేశీ జీన్స్"ను ప్రారంభిస్తానని, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల కోసం ఫార్మల్ దుస్తులను తీసుకొచ్చే అవకాశముందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతదేశంలోని యువత కూడా జీన్స్ ప్యాంట్లను ఎక్కువగా ఇష్టపడుతుండటంతో విదేశీ బ్రాండ్లతో పోటీపడేందుకు స్వదేశీ జీన్స్ ను తీసుకొస్తున్నామని, వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని మార్కెట్ లో ప్రవేశపెడతామని రాందేవ్ వెల్లడించారు.
"పరిధాన్" అనే పేరుతో రాబోయే ఈ స్వదేశీ జీన్స్ ప్యాంట్లను భారతీయులు విపరీతంగా ఆదరిస్తారనే ఆలోచనను రాందేవ్ బాబా వ్యక్తపరిచారు. ఈ సంగతి ఇలా ఉంటే.. ఈ జీన్స్ పై నెటిజన్లు తమదైనరీతిలో సెటైర్లు సంధించారు. రాందేవ్ స్వదేశీ బ్రాండ్ జీన్స్ ఈ విధంగా ఉండబోతున్నాయంటూ తమ బుర్రకు పదునుపెట్టి మరీ వెరైటీ ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు.
కాగా ఇప్పటికే దేశంలో శరవేగంగా భారీ మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న పతంజలి సంస్థ ఇప్పుడు విదేశాల్లోను తమ వ్యాపారాన్ని విస్తరించబోతున్నాయి. ఇప్పటికే నేపాల్ - బంగ్లాదేశ్ లో తమ వ్యాపార సంస్థల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశామని చెప్పిన రాందేవ్ బాబా.. త్వరలో పాకిస్థాన్ - అఫ్ఘనిస్థాన్ ల లో కూడా అడుగుపెడతామని తెలిపిన సంగతి తెలిసిందే.