తెలుగు దేశం ఆత్మరక్షణలో పడింది. అందులోంచి బయటపడటానికి ఇపుడు ప్రచారం అనే అస్త్రాన్ని వాడుకుంటోంది. అయితే, చంద్రబాబు-ఆయన పార్టీ వ్యవహారంపై ఈరోజు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సరైన వ్యాఖ్య చేశారు. 'టీడీపీకి పని తక్కువ.. ప్రచారం ఎక్కువ' అని వ్యాఖ్యానించారు. ఆయన అన్న మాటలు అక్షరాల నిజం.
ఇప్పటికే అమరావతి - పోలవరం - రైతు రుణమాఫీ వంటి పెద్ద ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. వీటిలో దేనిని ఆయన పూర్తి చేయలేదు. అమరావతి అయితే ఇప్పటికీ జీరో స్టేజిలోనే ఉంది. రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం పొలాలు ఇవ్వడానికి ముందుకు వస్తే దానిని వేగంగా కట్టి వారి స్థలాలు వారికిచ్చి రాజధానిని నిర్మించాల్సింది పోయి.. అక్కడ బినామీ రియల్ ఎస్టేట్ నడిపిస్తున్నారని ఇప్పటికే లోకం కోడై కూస్తోంది. టీజర్లు తప్ప సినిమా తీయని కథలా ఉంది అమరావతి పరిస్థితి అని అందరూ బాబును బహిరంగంగానే తిడుతున్నారు.
ఆయన తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం గురించి చెప్పినన్ని సార్లు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడలేదని సెటైర్లు వేస్తున్నారు.
ఇక టీడీపీకి తోడు బీజేపీ కూడా రాజకీయాలు తప్ప ప్రజా ప్రయోజన పనులు చేయడం లేదు.
మేము ఏపీకి ఎంతో ఇచ్చాం... కానీ చెప్పుకోలేకపోయాం అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఈరోజు విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం చెప్పారు. అసలు పాయింటేంటే... ఏపీకి ఏం చేశారనే ప్రశ్న ఒకటైతే... విభజనతో అనాథగా మిగిలిన ఏపీకి ఇతర రాష్ట్రాలకు మించి ఏం నిధులు ఇచ్చారన్న ప్రశ్నకు వారు నోరే విప్పరు. ఒక విగ్రహానికి కేటాయించినన్ని డబ్బులు కూడా పోలవరం ప్రాజెక్టుకు కేటాయించడం లేదు.
సరే పోలవరం అంటే... టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల ద్వారా డబ్బులు తింటారు కాబట్టి సరిగా ఇవ్వడం లేదంటే ఆలోచించొచ్చు. మరి రైల్వే జోన్ ఇవ్వడానికి ఎవరు అడ్డం ఉన్నారు కేంద్రానికి? ఎవరూ లేరు. అసలు మోడీకి ఏపీ అవసరమే లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. బుద్ధి లేని విభజనకు తన వంతు ఆజ్యం పోసిన బీజేపీ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకోలేక ఎంతో చేసినట్టు చెప్పుకోవడం విడ్డూరం. ఈ మధ్య బీజేపీ - టీడీపీ ఇద్దరిదీ ఒకే పరిస్థితి. పని తక్కువ... ప్రచారం ఎక్కువ.