సత్య‌నాదెళ్ల స‌త్తా చాటాడు

Update: 2015-11-13 05:03 GMT
తెలుగువాడు - మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రోమారు త‌న స‌త్తా చాటారు. ప్రపంచ వ్యాపార రంగంలోని 50 మంది అత్యుత్తమ వ్యాపార నాయకుల జాబితాలో స్థానం ద‌క్కించుకున్నారు. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో స‌త్య ఈ స్థానాన్ని పొందారు. ప్ర‌పంచంలో 50 మంది అత్యుత్తమ వ్యాపార నాయకుల వివరాలతో ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. ఈ దిగ్గ‌జ‌ జాబితాలో మొత్తం ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. మాస్టర్‌ కార్డ్ సీఈవో అజయ్ బంగా - కాగ్నిజెంట్ సీఈవో ఫెర్నాండెజ్ డిసౌజా - స‌త్య నాదెళ్లకు ఈ గౌరవం దక్కింది. ఇందులో బంగాకు 5వ స్థానం - డిసౌజాకు 16వ స్థానం - నాదెళ్లకు 47వ స్థానం లభించాయి.

అంతర్జాతీయ స్పోర్ట్స్ ఉత్పత్తుల సంస్థ నైకీ సీఈవో మైక్ పార్కర్ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానం ఫేస్‌ బుక్ సీఈవో - సహ వ్యవస్థాపకులు మార్క్ జుకెర్‌ బర్గ్‌ కు దక్కింది. ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ సీఈవో ఆండ్రూ విల్సన్ మూడు - ఆపిల్ సీఈవో టిమ్ కుక్ నాలుగు - అల్టా బ్యూటీకి చెందిన మేరీ దిల్లాన్ ఆరో స్థానంలో ఉన్నారు. షామీ సీఈవో లీ జున్‌ కు 7 - ఉబెర్‌ కు చెందిన ట్రావిస్ కలానిక్‌ కు 8వ స్థానం దక్కింది. ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ) సీఈవో ల్యారీపేజ్‌ కు 11వ స్థానం లభించగా.. చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా చైర్మన్ జాక్ మా 25వ స్థానంలో నిలిచారు. ప్ర‌పంచ య‌వ‌నీక‌పై స‌త్య అత్యంత ప్ర‌తిభాశాలి నాయ‌కుడిగా నిల‌వ‌డం తెలుగుగ‌డ్డ‌కు మ‌రోమారు గుర్తింపునిచ్చింది.
Tags:    

Similar News