తిరగబడింది; ఆగర్భ శ్రీమంతుడి రోజు ఆదాయం రూ.50

Update: 2015-04-12 10:39 GMT
దేశాధినేతలు సైతం ఆయన పక్కన కూర్చోవటానికి గర్వపడేవారు. ఇక.. ఆయన్ను తెలుగువాడిగా చెప్పుకోవటానికి ప్రతిఒక్కరూ పోటీ పడే వారు. ఇక.. భారతీయులైతే విదేశాలకు వెళితే.. తమ ఐకాన్‌గా చెప్పుకునే వారు. అలాంటి ఆయన ఇప్పుడు జైల్లో ఖైదీ నెంబరు 4148గా ఉంటున్నారు.

సత్యం కుంభకోణంలో దోషిగా నిర్ధారించి.. ఏడేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న సత్యం రామలింగరాజు ప్రస్తుత పరిస్థితి చూస్తే.. అయ్యో అనిపించకమానదు. చాలామందిచాలానే మాటలు చెప్పొచ్చు. తప్పు చేస్తే చివరకు ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని చెప్పొచ్చు. కానీ.. ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. సత్యం కంప్యూటర్స్‌లో ఏదో జరుగుతుందన్న సందేహమే తప్పించి.. ఇంకేమీ బయటకు తెలీదు.

కానీ.. రామలింగరాజు తన తప్పును తాను బయటకు చెప్పుకొని అడ్డంగా బుక్‌ అయ్యారన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏది ఎట్లా ఉన్నా.. ఒకప్పుడు వందలాది కోట్ల రూపాయిలకు ఆస్తిపరుడైన ఆయన ఇప్పుడు రోజుకు రూ.50కూలీగా జైల్లో పని చేస్తున్న పరిస్థితి. ఆయనకు జైల్లో చేసే పనికి ప్రభుత్వం రూ.50 ఇస్తుంది. ఇందులో రూ.25 మేరకు మాత్రమే ఖర్చుపెట్టుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న సత్యంరామలింగరాజుకు త్వరలో కంప్యూటర్‌కు సంబంధించిన పనులు అప్పజెబుతారని చెబుతున్నారు. లైబ్రరీ నిర్వహణ..కంప్యూటర్‌ బోధన.. చదువు చెప్పటం లాంటి పనులు చేయిస్తారని చెబుతున్నారు. ఏది ఏమైనా రాజులా బతికిన రామలింగరాజు ఈ రోజు ఖైదీ నాలుగు గోడల మధ్యనే ఉండాల్సి వస్తోంది.



Tags:    

Similar News