సత్యసాయి జిల్లాలో పరువు హత్య.. యువకుడిని హత్య చేయించిన యువతి తల్లి!
అనంతపురం జిల్లాలో కొద్ది రోజుల క్రితం జరిగిన పరువు హత్యను ఇంకా ఎవరూ మరిచిపోకముందే శ్రీ సత్యసాయి జిల్లాలో మరో పరువు హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. తమకంటే తక్కువ కులానికి చెందిన యువకుడిని తన కుమార్తె పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువతి తల్లి అతడిని దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లిలో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన ముత్యాలమ్మ, నాగన్న దంపతుల కుమారుడు మురళి (27) పీజీ చదివాడు. ప్రస్తుతం అతడు పెనుకొండ వద్ద ఉన్న కియా కార్ల కంపెనీలో పనిచేస్తున్నాడు. అలాగే కనగానపల్లికే చెందిన వీణ డిగ్రీ చదివింది. ప్రస్తుతం ఆమె గ్రామ మహిళా పోలీసుగా ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న మురళి, వీణలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్పారు. అయితే ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో ఈ పెళ్లికి వీణ తల్లి యశోదమ్మ అభ్యంతరం తెలిపింది. దీంతో వీణ, మురళి గత ఏడాది జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ అనంతపురం జిల్లా రాప్తాడులో కాపురం పెట్టి అక్కడే నివాసం ఉంటున్నారు.
అయితే పెళ్లయి ఏడాది గడిచిపోయినా.. అమ్మాయి కుటుంబసభ్యుల్లో కోపం తగ్గలేదు. తమ కంటే తక్కువ కులం వ్యక్తిని తమ కూతురు పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో మురళిని కిడ్నాప్ చేయించి దారుణంగా గొంతు కోసి హత్య చేయించారు. జూన్ 17న ఎప్పటిలాగే ఫ్యాక్టరీకి బయలుదేరిన మురళి ఆ రోజు సాయంత్రం రాప్తాడు వై.జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అతడిని బలవంతంగా లాక్కెల్లారు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన వీణ తన భర్త మురళికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో అతడితో పరిచయమున్నవారందరికీ ఫోన్ చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో రాప్తాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తుండగా జూన్ 18న రాప్తాడు మండలం లింగనపల్లి-రామినేపల్లి గ్రామాల మధ్యలో ఓ యువకుడి శవం ఉన్నట్టు సమాచారం అందుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి చూడగా అతడ్ని కిడ్నాప్‌కు గురైన మురళిగా గుర్తించారు. గొంతుకోసి హతమార్చినట్లు గుర్తించారు. తమ పెళ్లి ఇష్టం లేకనే తన తల్లి యశోదమ్మ తన భర్తను హత్య చేయించి ఉంటుందని వీణ ఫిర్యాదు ఆదారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు హత్యకు గురయిన యువకుడు కురుబ సామాజికవర్గానికి చెందిన యువకుడు కావడంతో ఆ సామాజికవర్గం నేతలు ఆందోళనకు దిగారు. మురళి హత్యతో ప్రమేయమున్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.