గత ఏడాది గల్ఫ్ సామ్రాజ్యంలో కీలక దేశమైన సౌదీ అరేబియాలో సంచలన వార్త తెరమీదకు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. సౌదీ రాజులు, అరబ్ షేక్‌లు రాజసంలో కాదు...అవినీతిలో కూడా ప్రత్యేకతను సంతరించుకున్నారని తేలింది. అది కూడా వందలు, వేలు కాదు ఏకంగా లక్షల కోట్ల అవినీతి జరిగిందని నిర్దారించారు. ఈ విషయాన్ని సౌదీ అటార్నీ జనరల్ వెల్లడించారు. సౌదీలో అవినీతి వ్యతిరేక దాడులు కొనసాగగా.. దాంట్లో201 మందిని విచారించినట్లు అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్ మోజిబ్ తెలిపారు. చాలా చాకచక్యంగా గత కొన్ని దశాబ్ధాలుగా సుమారు 6.5 లక్షల కోట్ల(100 బిలియన్ డాలర్లు) అవినీతి జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇలా అవినీతి ఆరోపణలతో గతేడాది నవంబర్‌లో జైలుపాలైన సౌదీ అరేబియా యువరాజు అల్వాలీద్ బిన్ తలాల్ ఆ కేసు నుంచి బయటపడేందుకు ప్రభుత్వానికి విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారని సమాచారం. అయితే ఆయన ప్రతిపాదనను సౌదీ సర్కార్ ఆమోదించలేదని తెలిసింది.
సోదాల్లో నేషనల్ గార్డ్ హెడ్ అయిన మరో యువరాజును, ఆర్థికమంత్రిని కూడా తొలగించారు.11మంది యువరాజులు, నలుగురు ప్రస్తుత మంత్రులు, 12మంది మాజీ మంత్రులు అరెస్టయిన వారిలో ఉండగా.... ఆ సమయంలో ప్రపంచంలోనే సంపన్నుడైన యువరాజు అల్-వలీద్ బిన్ తలాల్ కూడా అరెస్టు కావడం అంతర్జాతీయ వ్యాపారవర్గాలను షాక్‌కు గురిచేసింది. ఆయనకు ట్విట్టర్, సిటీ బ్యాంక్ వంటి పలు సంస్థల్లో పెట్టుబడులున్నాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ అంచనా ప్రకారం అల్వాలీద్ బిన్ తలాల్ ఆస్తులు 1700 కోట్ల డాలర్లు. అయితే ఈ కేసు నుంచి బయటపడేందుకు తానే తప్పు చేసినా.. తన ఆస్తుల్లో ఏదైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చునని అల్వాలీద్ ప్రతిపాదించారని వినికిడి. ప్రస్తుత రాజు సల్మాన్‌తోపాటు మితేబ్ బిన్ అబ్దుల్లా కూడా రాజ కిరీటం కోసం పోటీ పడ్డారు. అయితే 100 కోట్ల డాలర్లకు పైగా చెల్లించి మితేబ్ బయటపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి.
గల్ప్ సామాజ్రంలో సౌదీ అరేబియా చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. గతంలో ఓ రేప్ కేసులో దొరికాడని ఏకంగా ఓ యువరాజునే ఉరి తీసిన ఘటన గుర్తుండే ఉంటుంది. అవినీతికి పాల్పడ్డారంటూ 11 మంది యువరాజులు, పదుల సంఖ్యలో మాజీ మంత్రులను అరెస్ట్ చేసి లోపలేశారు. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని అవినీతి నిరోధక కమిటీ ఒకటి వీళ్లను దోషులుగా తేల్చింది. శనివారం రాత్రి వీళ్లందరినీ అదుపులోకి తీసుకున్నట్లు కింగ్ హోల్డింగ్ కంపెనీకి చెందిన ఉన్నతస్థాయి ఉద్యోగి ఒకరు వెల్లడించారు.
ఎర్రసముద్ర తీరాన ఉన్న జెడ్డా నగరం 2009లో వరదముంపునకు గురైన ఘటనలో పలువురు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజాధనాన్ని కాపాడలేకపోయారన్న అభియోగాలతో పాత కేసు పెండింగ్‌లో ఉన్నది. చమురు యుగం తర్వాత సౌదీలో జరుగుతున్న అభివృద్ధి సంస్కరణలను ప్రత్యక్షంగా చూపించేందుకు 2009లో సౌదీరాజు అంతర్జాతీయ వాణిజ్య సదస్సును జెడ్డాలో నిర్వహించారు. వేలాదిమంది ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు దానికి హాజరయ్యారు. అయితే ఆ సదస్సు జరిగిన వారం రోజుల వ్యవధిలోనే జెడ్డా నగరం వరదముంపునకు గురవడంతో సౌదీ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొన్నది. వరద నిరోధక చర్యలు సక్రమంగా జరుగలేదన్న అభియోగాలపై గతంలోనే విచారణ చేపట్టినప్పటికీ కేసు పెండింగ్‌లో ఉండిపోయింది. శనివారం బాధ్యతలు చేపట్టిన కొత్త అవినీతి నిరోధక కమిషన్.. యువరాజులు, దర్బార్ సిబ్బందికి సంబంధించిన నివేదికను శనివారం రాజు ముందుంచింది.
కాగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ఇస్లామిక్ విధి అని, అందుకే అత్యున్నత స్థాయి అరెస్ట్‌లు కూడా చోటు చేసుకున్నాయని దేశంలోని మత పెద్దలు చెబుతున్నారు. ఈ యాంటీ కరప్షన్ కమిటీకి అరెస్ట్ వారెంట్లు జారీ చేయడంతోపాటు ప్రయాణాలపై నియంత్రణలు, బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసే హక్కులు కూడా కట్టబెట్టారు. ప్రజాధనాన్ని దోచుకుంటూ.. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వారి పనిపట్టడానికే ఈ అవినీతి నిరోధక కమిటీని ఏర్పాటు చేసినట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది.