మక్కా మహావిషాదం వెనుక చీకటి కోణం బయటకు వస్తుంది. జనాలు ఏమైనా కానీ.. తమ యువరాజు ప్రాభవం కోసం సౌదీ అధికారులు ప్రదర్శించిన కక్కుర్తి వందలాదిమంది ప్రాణాలు పోయేందుకు కారణమైందన్న విమర్శల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది.
మక్కాలో చోటు చేసుకున్న భారీ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా.. సౌదీ యువరాజు కోసం ఒక రోడ్డు బ్లాక్ చేయటమేనని పలువురు చెబుతున్నారు. దీనికి తోడు.. ఈ వ్యవహారంలో భారీగా తమ పౌరుల్ని నష్టపోయిన ఇరాన్ తీవ్రంగా మండిపడుతుంది. తమ ప్రజల ప్రాణాలు తీసిన సౌదీ సర్కారును అంతర్జాతీయ కోర్టుకు ఈడ్చటం పాటు.. దాని సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తోంది.
ఇరాన్ వైఖరిపై సౌదీ గుర్రుగా ఉంది. తమను బద్నాం చేయటంపై సౌదీ రాజకుటుంబం రగిలిపోతోంది. తమ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఇరాన్ వ్యవహరిస్తుందని మండిపడుతోంది. జరిగిన విషాదంలో తమ తప్పు అస్సలు లేదని.. తొక్కిసలాట లాంటి దుర్ఘటనల్ని వెంటనే నియంత్రించలేమని.. అది విధి ఆడే నాటకంగా సౌదీ మతాధికారి షేక్ అబ్దుల్ చెబుతున్నారు.
మరోవైపు సౌదీ అధాకారులు ఇరాన్ పౌరుల కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందని.. అధికారుల సూచనలు పాటించకుండా ఇరాన్ యాత్రికులు దూసుకుపోయారని.. దీని కారణంతోనే ఈ భారీ తొక్కిసలాట చోటు చేసుకుందని వాదిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇద్దరు టీవీ రిపోర్టర్లు.. ఒక రాజకీయ విశ్లేషకుడితో సహా మొత్తం 340 మంది అదృశ్యమైనట్లు చెబుతున్నారు. వీరి ఆచూకీకి సంబంధించి ఏదీ బయటకు రాలేదంటున్నారు. మరి.. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రావటం లేదు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు.