భారీ ఉగ్రదాడి కొద్దిలో తప్పింది. అయితే.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పవిత్ర ప్రార్థనా స్థలమైన మక్కా మసీదును టార్గెట్ చేశారు ఐసిస్ పిశాచాలు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇప్పటికే ఆత్మాహుతి దాడులు.. ఉగ్రదాడులు చేపట్టిన ఐసిస్.. తాజాగా పవిత్ర మక్కాలోనూ బరి తెగించటం సంచలనంగా మారింది.
పవిత్ర రంజాన్ మాసంలో మక్కా మసీదు వద్ద భారీ ఉగ్రదాడి జరిపేందుకు ఐసిస్ స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా దాడులకు పక్కా ప్లాన్ వేసింది. తాజాగా చోటు చేసుకున్న ఘటనలో ఒక ఉగ్రవాది తనను తాను పేల్చుకోవటంతో ఐదుగురు పోలీసులతో సహా పదకొండుమందికి గాయాలయ్యాయి. ఉగ్రదాడికి ప్రయత్నం చేసిన మహిళను సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఉగ్రదాడులకు పాల్పడాలన్న ఆలోచనలో ఉన్న మరో ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నారు. రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలకువెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకొని భారీ మారణహోమం చేయాలన్న లక్ష్యంతో తాజా ఉగ్రదాడికి ఐసిస్ ప్లాన్ చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే.. అప్రమత్తంగా ఉన్న సౌదీ పోలీసులు ఈ భారీ ఉగ్రకుట్రను నిలువరించగలిగారు. ఉగ్రవాదులకు సాయం అందిస్తున్నారంటూ సంపన్న దేశమైన ఖతార్ పై సౌదీతో సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన వేళ.. సౌదీలో ఈ భారీ ఉగ్రదాడి జరగటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/