ప్రపంచంలో 8వ వింతకు శ్రీకారం చుట్టిన సౌదీ.. ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కే
సౌదీ అరేబియా మరో ప్రపంచవింతకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే అత్యంత భారీ స్థాయిలో నిర్మించేందుకు రెడీ అయ్యింది. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏడు వింతలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వరల్డ్ లో ఎనిమిదో వింత ఆవిష్కృతం కానుంది.
సౌదీ అరేబియాలో త్వరలోనే అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం పూర్తికానుంది. పేరుకు తగ్గట్లే ఇది ఎత్తుకన్నా పక్కలకు ఎక్కువగా విస్తరించి ఉంటుంది. ఈ నిర్మాణం ఏకంగా 120 కిలోమీటర్ల పొడువున ఉండనుంది. దీని పొడవు దాదాపుగా అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం అంత ఉండనుంది. ప్రపంచంలోని ఎనిమిదో వింతగా ఇది అందరినీ అబ్బురపరచనుంది.
సౌదీ యువరాజు, ఉప ప్రధాని బిన్ సల్మాన్ఏకంగా 26500 చదరపు కిలోమీటర్ల మేర ఈ భారీ నిర్మాణం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. భవిష్యత్ నగరం 'నియోమ్ సిటీ'లో భాగంగా 120 కి.మీ. పొడవైన రెండు సైడ్ వే స్కైస్క్రాపర్లను నిర్మించనున్నారు.
వాయువ్య సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రానికి చెందిన గల్ఫ్ ఆఫ్ అకాబా తీరం నుంచి ఎడారిలో ఉన్న కొండల మధ్య దాకా ఈ ప్రాజెక్ట్ విస్తరించనుంది. ఈ రెండు భవనాలను అద్దాలతో అలకరించినున్నందున దీనికి 'మిర్రర్ లైన్' అని పేరు పెట్టారు. ఎత్తులోనూ ఇవి ప్రపంచంలోని ఇతర ఆకాశహర్మ్యాల స్తాయిలో రూపుదిద్దుకోనున్నాయి. 490 మీటర్ల వరకూ అంటే దాదాపు అరకిలోమీటరు ఎత్తు వరకూ ఈ భవనాలను నిర్మించనున్నారు.
న్యూయార్క్ లో ఉన్న 102 అంతస్థుల ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చిట్టచివరి కొనవరకూ ఉన్న ఎత్తు 443 మీటర్ల కన్నా ఈ రెండు భవనాలు మరెంతో ఎత్తువరకూ కనిపించనున్నాయి. ఇంత పొడవైన జంట భవనాల్లో కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఇళ్లల్లో ఏకంగా 50 లక్షల నుంచి నివాసం ఉండవచ్చు.
ఇక రోజుకు మూడు పుటలా భోజనానికి సబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి అవసరమైన పంటలను సైతం ఈ విస్తీర్ణంలోనే పండించనున్నారు. భవనానికి ఒక చివరి నుంచి మరో చివరివరకూ 20 నిమిషాల్లో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా భూగర్భంలో హైస్పీడ్ రైల్వే లైన్, పాదచారుల కోసం వాక్ వేస్, వేల నుంచి 1000 అడుగుల ఎత్తులో భారీ స్టేడియం వంటి ఎన్నో హంగులు ఇందులో ఉండనున్నాయి.
ఇక భారీ నిర్మాణానికి ఖర్చు కూడా అత్యంత భారీగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సుమారు 50 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏకంగా రూ.80 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు సమాచారం.