టీడీపీ నుంచి టీఆరెస్ లో చేరిన కంటోన్ మెంటు ఎమ్మెల్యే సాయన్న కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఫాలో అవుతారా? ఆయనలాగే టీడీపీని వీడినరా ఆ పార్టీ వల్ల వచ్చిన పదవి వీడకుండా వేలాడుతారా? అన్న చర్చకు తెరలేచింది. తలసాని టీడీపీని వదిలేసినా ఆ పార్టీలో ఉంటూ గెలిచిన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.. పైగా దాన్ని అడ్డంపెట్టుకుని తెలంగాణలో మంత్రి పదవీ కొట్టేశారు. ఆ వివాదం ఇప్పటికీ చల్లారలేదు. తాజాగా కంటోన్ మెంటు సాయన్న కూడా అదే బాటన సాగుతారా లేదంటే నైతిక విలువలకు కట్టుబడతారా అన్నది చూడాలి. సాయన్నను చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు సభ్యుడిగా నియమించారు. ఇప్పుడు ఆయన ఆ పదవికి రాజీనామా చేస్తారో లేదో చూడాలి.
తెలంగాణలో అధికారంలో లేకపోయినా అక్కడి పార్టీ నేతలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు అక్కడి నేతలకు ఏపీలో కొన్ని పదవులిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో టీటీడీ బోర్డును నియమించినప్పుడు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. కంటోన్ మెంటు ఎమ్మెల్యే సాయన్నలను చంద్రబాబు టీటీడీ మెంబర్లుగా నియమించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు టీఆరెస్ విసిరిన వలలో పడి సాయన్న గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయన ఇప్పుడు ఆ పదవి రాజీనామా చేసేలా కనిపించడం లేదు. దీంతో కొద్దిరోజులు వేచి చూసి ఆయన్ను తొలగించి వేరొకరిని చంద్రబాబు నియమించే అవకాశం ఉంది.