మరో తలనొప్పి: అనిల్ అంబానీకి ఎస్బీఐ ఝలక్

Update: 2020-06-12 09:30 GMT
ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి మరో తలనొప్పి వచ్చింది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఝలక్ ఇచ్చింది. అనిల్ ను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు ఎస్బీఐ లాగింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ (RITL)లకు చెందిన రూ.1,200 కోట్ల రుణాలపై అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇవ్వడంతో ఈ అంశంపై ఎస్బీఐ ఆయనను ముంబై బెంచ్‌కు చెందిన ఎన్సీఎల్టీకి ముందుకు లాగింది.

ఐబీసీ సెక్షన్ 95(1) కింద కేసు నెంబర్ సీపీ (ఐబీ) నెంబర్ 916, 917 దాఖలు చేయబడిందని, వ్యక్తిగత హామీదారు దివాలా తీర్మానం ప్రక్రియ కోసం అనిల్ అంబానీపై ఎస్బీఐ ఎన్సీఎల్టీకి వెళ్లింది.

ఈ అంశంపై అనిల్ అంబానీ ప్రతినిధి స్పందించారు. ఇది రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ రుణాలకు సంబంధించిన విషయమని, ఇది అనిల్ అంబానీ సొంత రుణం కాదని వివరణ ఇచ్చారు. దీనిపై అనిల్ అంబానీ సమాధానం చెబుతారని తెలిపారు. అనిల్ అంబానీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు లాగింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ (RITL)లకు చెందిన రూ.1,200 కోట్ల రుణాలపై అనిల్ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఎస్బీఐ ఆయనను ముంబై బెంచ్‌కు చెందిన ఎన్సీఎల్టీకి లాగింది

అయితే అనిల్ అంబానీకి కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గత నెలలో చైనా బ్యాంకులకు రుణాన్ని చెల్లించాలని యూకే కోర్టు ఆదేశించింది. చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 717 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,446 కోట్లు) రుణానికి సంబంధించి అనిల్ అంబానీ పూచీగా ఉన్నారు. 2012 ఫిబ్రవరిలో ఆర్.కామ్ ఈ రుణాన్ని తీసుకున్నది. కానీ ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో నడుస్తుండటంతో.. తాము ఇచ్చిన రుణం తిరిగి చెల్లించాలని బ్యాంకులు కోర్టును ఆశ్రయించాయి. లాక్ డౌన్ వల్ల పిటిషన్‌ను లండన్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పిటిషనర్ రుణాలపై వాదనలు విన్న ధర్మాసనం.. అనిల్ అంబానీని రుణ మొత్తం చెల్లించాలని జస్టిస్ నిగెల్ ఆదేశించారు. ఇందుకు 21 రోజుల గడువును ఇచ్చింది.

3.2 క్లాజ్ ప్రకారం తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో, గ్యారంటీ ఉన్న అనిల్ అంబానీ రుణం చెల్లించాల్సి ఉంటుందని లండన్ కోర్టు ఆదేశించింది. రుణం చెల్లించేందుకు అనిల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా ఎస్బీఐ నిర్ణయంతో అతడికి నోటీసులు అందనున్నాయి.
Tags:    

Similar News