ఓపక్క నల్ల కుబేరుల అంతు తేల్చేందుకు మోడీ సర్కారు పెద్దనోట్ల రద్దు అంటూ బ్రహ్మాస్త్రాన్ని ప్రజల మీదకు సంధిస్తే.. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్ బీఐ (భారతీయ స్టేట్ బ్యాంకు) సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. బడా బాబులకు వెనకా ముందు చూసుకోకుండా అప్పులిచ్చేసిన ఆ బ్యాంకు.. ఇప్పుడా మొత్తాల్ని వసూలు చేయలేక పోతోంది. ఇలా పోగుపడిన వేలాది కోట్లల్లో నుంచి రూ.7వేల కోట్లను రాని బాకీలుగా లెక్క తేల్చింది.
అడ్వాన్స్ అండర్ కలెక్షన్ అకౌంట్స్.. సంక్షిప్తంగా ‘‘ఆకా’’ పేరిట మొండి బకాయిల్ని నిరర్ధక ఆస్తులుగా తేలుస్తూ ప్రత్యేక అకౌంట్ కి తేల్చేసింది. అంటే.. ఈ అప్పులు ఇక రావన్నట్లుగా తేల్చేసినట్లుగా చెప్పొచ్చు. 63 మందికి చెందిన ఈ బకాయిల మొత్తాన్ని రైటాఫ్ చేసినట్లుగా ప్రకటించిన ఎస్ బీఐ.. ఇంత భారీ మొత్తాన్ని ఏం చూసుకొని రుణాలు ఇచ్చిందన్నది పెద్ద ప్రశ్న.
ఇలాంటి సూటి ప్రశ్నలు వేసిన వారికి బ్యాంకు వర్గాలు సాంకేతిక అంశాల్నితెర మీదకు తీసుకొచ్చి తెలివిగా బదులిచ్చే ప్రయత్నం చేయటం గమనార్హం. బ్యాంకు వాదన ప్రకారం.. పుస్తకాల్లో ఈ మొండి బకాయిల్ని రైటాఫ్ చేసినట్లుగా ప్రకటించినప్పటికీ.. పూర్తి స్థాయిలో వీటిని రద్దు చేసినట్లు కాదని చెబుతున్నారు. రైట్ ఆఫ్ చేసి వేరే అకౌంట్ కి బదిలీ చేయటం ద్వారా.. ఎస్ బీఐ అకౌంట్స్ లో మొండి బకాయిల పద్దు తగ్గిపోతుంది. దీంతో.. బ్యాంకు పనితీరు మెరుగుపడినట్లుగా కనిపిస్తుంది. అయితే.. మొండి బకాయిలుగా తేల్చేసిన మొత్తంగా రికవరీ విధానం ఎప్పటి మాదిరే కొనసాగుతుందని చెబుతున్నారు.
ఓపక్క నల్ల కుబేరుల అంతు చూసే విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉన్నట్లుగా ప్రకటిస్తున్నవేళ.. మరోవైపు.. 63 మంది బడా బాబులకు చెందిన అప్పుల్ని లైట్ తీసుకున్నట్లుగా ఎస్ బీఐ వ్యవహరించటంపై పలువురు తప్పు పడుతున్నారు. ఎస్ బీఐ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో మండిపడగా.. వీరి విమర్శలకు బదులిచ్చిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. మొండి బకాయిల్ని రైటాఫ్ చేయటం అంటే.. మాఫీ చేసినట్లు కాదని.. వాళ్ల వద్ద నుంచి రుణాల్ని వసూలు చేయకుండా ఆపేస్తామన్న అర్థం కాదని.. వారి నుంచి అప్పు మొత్తాన్ని రాబట్టే కార్యక్రమం సాగుతుందని పేర్కొన్నారు. ఇక.. 63 మంది మొండి బకాయిదారుల జాబితాలో మొదటి పేరు ఎవరిదో కాదు.. రాజ్యసభ సభ్యుడిగా పదవి వెలగబెట్టి.. లిక్కర్ కింగ్ గా పేరున్న విలాస పురుషుడు విజయ్ మాల్యానే. గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి పారిపోయిన ఇతగాడికి సంబంధించిన రూ.1200 కోట్ల మొత్తాన్ని మొండి బకాయిలుగా బ్యాంకు రైటాఫ్ చేయటం గమనార్హం.
ఇక.. ఎస్ బీఐ రైట్ ఆఫ్ చేసిన 63 మొండి బకాయిల్లో టాప్ టెన్ చూస్తే..
1. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.1201 కోట్లు
2. కేఎస్ ఆయిల్స్ రూ.0596కోట్లు
3. సూర్యా ఫార్మాస్యూటికల్స్ రూ.0526కోట్లు
4. జీఈటీ ఇంజనీరింగ్ కన్ స్ట్రక్షన్స్ రూ.0400కోట్లు
5. సాయి ఇన్ఫో సిస్టమ్స్ రూ.0376కోట్లు
6. వీఎంసీ సిస్టమ్ రూ.0370కోట్లు
7. అగ్నైట్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ రూ.0315కోట్లు
8. శ్రీగణేష్ జ్యూయలరీ రూ.0313కోట్లు
9. ఎపెక్స్ ఎన్ కాన్ ప్రాజెక్ట్స్ రూ.0266కోట్లు
10. యూరో సిరామిక్స్ రూ.0266కోట్లు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/