ఒక్కో గుడికి ఒక్కో పద్దతి ఉంటుంది. అన్ని గుళ్లల్లో ఒకేలా పూజలు చేయరన్నది మర్చిపోకూడదు. క్షేత్ర చరిత్రకు తగ్గట్లుగా వ్యవహార ధోరణి ఉంటుంది. అయితే.. ఇందుకు భిన్నంగా శబరిమల ఆలయంలోకి కేవలం పురుషులు.. కొంతమంది మహిళలకు మాత్రమే ప్రవేశం ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. అలా చేస్తారు? అంటూ కొత్త వాదనల్ని తీసుకొచ్చి శబరిమలకు అందరు మహిళలకు దర్శనభాగ్యం కల్పించాలంటూ సుప్రీంను ఆశ్రయించటం.. అవునవును.. అంటూ తమ తోటి మహిళా న్యాయమూర్తి వ్యతిరేకించినా.. పురుషపుంగవ న్యాయమూర్తులు మాత్రం ఆలయదర్శనానికి ఓకే చెప్పటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా సుప్రీం తీర్పు అన్నంతనే..దానికి వ్యతిరేకంగా గళం విప్పటానికి కొంత సంశయం ఉంటుంది. మామూలుగా కోర్టు తీర్పులు ఏవైనా అలాంటి పరిస్థితే. ఇక.. సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాట్లాడటానికి వెనుకా ముందు ఆడే పరిస్థితి. ఇదిలా ఉంటే.. శబరిమల క్షేత్రాన్ని మహిళలు కూడా సందర్శించొచ్చని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. దేశంలో ఇప్పటివరకూ మహిళలకు ప్రవేశం లేని మందిరాలకు సంబంధించిన మాటేమిటి? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
హర్యానాలోని పెహవాలో ఉన్న కార్తికేయ భగవాన్ మందిరం.. మహారాష్ట్రలోని సతారాలో కొలువైన ఘటయా దేవీ మందిరం..సోలాలోని శివలింగ దర్శనం.. అసోంలోని బర్చెచటాలోని వైష్ణవ మందిరం.. జార్ఖండ్ బొకారోలో ఉన్న మంగళ్ చండీ మందిరం.. ఛత్తీస్ గఢ్ లోని ధమ్తరీలో ఉన్న మవాలీమాతా మందిరం.. ఇలా చెప్పుకుంటూ చాలానే ఆలయాలు ఉన్నాయి.
వీటన్నింటికి.. సుప్రీం తాజా తీర్పు అమలు చేసుకోవచ్చా? మనుషులకు ఉండే హక్కులు.. దేశ పరిధిలో భాగమైన దేవుళ్లకు ఉండవా? వాటి ఘన చరిత్రను కొనసాగించే విషయంలో సుప్రీం తీర్పులు ఎంతవరకు సమంజసం. రెండు రోజుల క్రితమే.. వివాహేతర సంబంధాలపై తండ్రి ఇచ్చిన తీర్పును కొడుకే కాదన్న సంగతి. అలాంటప్పుడు వందల ఏళ్లుగా ఉన్న సంస్కృతిని.. పరిమితుల్ని తోసేసి.. మా తీర్పుతో అవన్నీ మార్చేయటం అన్నది తొందరపాటే అన్న వాదన సుప్రీం న్యాయమూర్తుల చెవుల్లో పడుతోందా?