సుప్రీంకోర్టులో ల‌గ‌డ‌పాటికి రిలీఫ్‌

Update: 2017-05-09 16:09 GMT
కాంగ్రెస్ నేత‌, మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ కు పెద్ద‌ రిలీఫ్ ద‌క్కింది. సుప్రీంకోర్టులో న‌మోదై దాదాపు మూడేళ్లుగా కొన‌సాగుతున్న కేసులో ఆయ‌న‌కు పెద్ద ఉప‌శ‌మ‌నం దొరికింది. రాష్ట్ర విభజన సమయంలో బిల్లు ఆమోదం సంద‌ర్భంగా ఏపీ ఎంపీలు, తెలంగాణ ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు పాల్పడే వరకు వెళ్లింది. ఈ సంద‌ర్భంగానే ఆనాడు ఎంపీగా ఉన్న ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ లోక్‌సభలో పెప్పర్ స్ప్రే చ‌ల్లిన సంగ‌తి తెలిసిందే.

లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లిన ఉదంతంపై కాంగ్రెస్ నేత, క‌రీంన‌గ‌ర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విభజన బిల్లును అడ్డుకునేందుకు అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హరించిన ల‌గ‌డ‌పాటి స‌భా మ‌ర్యాద‌లు మంట‌గ‌లిపార‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ త‌ర‌ఫు లాయ‌ర్లు వాదించారు. సుదీర్ఘ వాద‌న‌ల అనంత‌రం ఈ రోజు దీనిని సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కు పెద్ద రిలీఫ్ ద‌క్కిన‌ట్ల‌యింది.
Tags:    

Similar News