క‌త్తులు నూరుకుంటున్న వైసీపీ ఎస్సీ నేత‌లు.. రీజ‌న్ ఇదే!

Update: 2022-10-16 03:30 GMT
వైసీపీ నేత‌ల్లో ఎవ‌రు ఎలా ఉన్నా.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు మాత్రం అంతో ఇంతో క‌లిసి క‌ట్టుగా ఉంటార‌నే పేరుంది. అయితే..  ఓ ఇద్ద‌రు కీల‌క‌నాయ‌కులు మాత్రం రోడ్డున ప‌డ్డారు. వీరిద్ద‌రూ కూడా..చాలా ఉన్న‌త‌స్థాయి విద్యావంతులు కావ‌డం గ‌మ‌నార్హం.

వారే.. మంత్రి మేరుగ నాగార్జున‌(గుంటూరు జిల్లాకు చెందిన నాయ‌కుడు), మ‌రొక‌రు స‌ల‌హాదారు.. జూపూడి ప్ర‌భాక‌ర్‌(ప్ర‌కాశం జిల్లాకు చెందిన మేధావి). అయితే.. ఇద్ద‌రూ కూడా.. వారి వారి సామాజిక వ‌ర్గాల కోసం.. ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఎందుకంటే..వీరికి ప‌ద‌వులు ఇవ్వ‌డం వెనుక .. జ‌గ‌న్ ల‌క్ష్యం అదే.

అయితే.. దీనికి భిన్నంగా.. మంత్రి వ‌ర్సెస్ స‌ల‌హాదారు.. ఇద్ద‌రూ కూడా.. ఇగోల‌కు పోతున్నార‌ని.. పార్టీలోను.. మంత్రి మేరుగ చూస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ‌లోనూ పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. గ‌తంలో వైసీపీలో ఉన్న జూపూడి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో చేరడం, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం, ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో తిరిగి వైసీపీలోకి చేరిన సంగతి తెలిసిందే.

ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు జూపూడి చెత్త తరలించే ఆటోలను కొనుగోలు చేసి ఎస్సీ యువతకు అందించాలని భావించారు. అయితే ఆయా ఏజెన్సీలు వాహనాలను పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోవడమే కాకుండా ఎస్సీ కార్పొరేషన్‌ ఇచ్చిన అడ్వాన్స్‌ నిధులను కూడా తిరిగి చెల్లించలేదు.  

దీనిపై మంత్రి మేరుగు దృష్టిసారించారు. ఆ ఏజెన్సీలు జూపూడి అనుయాయులేనని మంత్రి భావించినట్లు తెలుస్తోంది. ఈ వాహనాలకు ఇచ్చిన అడ్వాన్సు నిధులను వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉందని పదే పదే ఆయా ఏజెన్సీలకు నోటీసులిచ్చారు. దీంతో వారి మధ్య విభేదాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని సమాచారం.

ఇదిలాఉంటే..  ప్రభుత్వ శాఖలన్నిటికీ తాను న్యాయ సలహాదారు అని, సాంఘిక సంక్షేమ శాఖలో కొన్ని కీలక అంశాలు అమలు చేయాలంటూ జూపూడి ప్ర‌భాక‌ర్‌ 11 పేజీల నోట్‌ను ఇటీవల ఆ శాఖకు పంపించారని సమాచారం. అయితే.. ఆ సలహాలను పాటించాల్సిన పని లేదంటూ ఆ నోట్‌ను మంత్రి మేరుగ నాగార్జున‌ చెత్తబుట్టలో పడేయడంతో.. ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు చెప్పుకొంటున్నారు. మ‌రి ఇవి మ‌రింత పెరుగుతాయో.. లేక ఇక్క‌డితో ఆగుతాయో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News