సుప్రీంకోర్టు కొద్దిసేపటి కిందట వెలువరించిన తీర్పు ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులకు చెంపపెట్టులా మారింది. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి - ఒకప్పటి ఉత్తర్ ప్రదేశ్ సీఎం రాజ్ నాథ్ సింగ్ కూడా అందులో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులకు ఢిల్లీలో ప్రభుత్వ బంగళాలు కేటాయించరాదని సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం చెప్పిన సంచలన తీర్పు వీరందరికీ షాకిచ్చింది. గతంలో ఉత్తర్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలో వీరంతా ఢిల్లీలో ప్రభుత్వ బంగళాలు తీసుకున్నారు. కానీ... పదవి పోయినా ఇల్లు మాత్రం ఖాళీ చేయడం లేదు. దీనిపై దాఖలైన కేసులో సుప్రీం ధర్మాసనం కొద్దిసేపటి కిందట తీర్పు చెప్పింది. రెండు నెలల్లోగా ఆ బంగళాలను ఖాళీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయాల్సిన వారి జాబితాలో యూపీ ప్రస్తుత సీఎం అఖిలేశ్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ - బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి - బీజేపీ సీనియర్ నేత కల్యాణ్ సింగ్ - కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్డీ తివారీ - రామ్ నరేశ్ యాదవ్ లు ఉన్నారు. వీరితో పాటు ప్రస్తుత కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేరు కూడా ఉంది. ఆయన కూడా గతంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఢిల్లీలో బంగళా తీసుకున్నారు. ఇప్పటికీ అది ఖాళీ చేయలేదు.
వీరందరి తీరుపై దాఖలైన కేసులో వాదనలు విన్న సుప్రీం ఈ మేరకు రెండు నెలల గడువు ఇస్తూ తీర్పు చెప్పింది.వీరిలో దశాబ్దాలుగా ఖాళీ చేయనివారూ ఉన్నారు. ఇప్పుడైనా సుప్రీం మాట మన్నించి ఖాళీ చేస్తారో లేదంటే ఇంకా మొండికేస్తారో చూడాలి.