ఈబీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

Update: 2019-01-25 16:23 GMT
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలైన పీటీషన్‌ పై కేంద్రం స్పందించింది . దీనిపై మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈబీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఈబీసీ రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ బిజినెస్‌మ్యాన్‌ పూనావాలా ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. రిజర్వేషన్‌ల కోసం వెనుకబాటుతనాన్ని కేవలం ఆర్థిక ప్రాతిపదికనే పరిగణనలోకి తీసుకోలేమని చెబుతూ ఈ బిల్లును కొట్టివేయాల్సిందిగా పిటిషనర్‌ న్యాయస్ధానాన్ని కోరారు. జనరల్‌ కేటగిరీలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్‌ కల్పించడం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన 50 శాతం రిజర్వేషన్‌లను మించిపోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర కేబినెట్‌ మూడు వారాల క్రితం నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు రాజ్యసభలో వీగిపోతుందని అందరూ భావించారు. కానీ అక్కడా కూడా ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లు పాసైంది. దీంతో.. బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వెళ్లింది. ఆయన కూడా ఆమోదముద్ర వేయడంతో.. బిల్లు కాస్తా చట్టంగా మారింది. నిజం చెప్పాలంటే.. అగ్రవర్ణ పేదలకు ఇది మంచి శుభవార్తే. ఎన్నికల మందు నిర్ణయం కాబట్టి… దీని ప్రభావం మోదీపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇది ఎన్నికల స్టంట్‌ అని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది.   
Tags:    

Similar News