ఆమధ్య రాజధాని రైతులపై పోలీసులు పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు చెల్లదని హైకోర్టు తీర్పుచెప్పింది. రాజధాని గ్రామాల్లో ఒకటైన క్రిష్ణాయపాలెం గ్రామంలో కొందరు స్ధానికులకు, బయట గ్రామస్తులకు మధ్య గొడవ జరిగింది. బయటగ్రామస్తులు కొందరు ఆటోల్లో వస్తుంటే కృష్ణాయపాలెం దగ్గర కొందరు స్ధానికులు వాళ్ళ ఆటోలను నిలిపేశారు. దాంతో రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సందర్భంగా ఆటోలో వస్తున్న వాళ్ళపై దాడులు చేశారనే ఆరోపణలపై పోలీసులు కొందరు రైతులను అదుపులోకి తీసుకుని వాళ్ళపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు.
అయితే పోలీసులు ఎవరిమీదైతే కేసులు పెట్టారో వాళ్ళు ఎస్సీలే అని తేలింది. దాంతో ఎస్సీలపై ఎవరైనా దాడులు చేసినా, వేధించినా పెట్టాల్సిన ఎస్సీ, ఎస్టీ వేదింపుల కేసులు ఉల్టాగా ఎస్సీలపైనే ఎలా పెడాతారంటూ కొందరు కోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఈరోజు రైతులపై పోలీసులు పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదంటూ కొట్టేసింది.
నిజానికి ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు పెట్టడాన్ని అప్పట్లోనే చాలామంది ఆశ్చర్యపోయారు. ఎస్సీలపై ఎస్సీ వేధిపుల చట్టం క్రింద కేసులు పెట్టవచ్చా ? లేదా ? అన్న విషయాన్ని కూడా పోలీసులు చూసుకోలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. పోలీసులు మరీ ఇంత గుడ్డిగా కేసులు నమోదుచేస్తున్నారంటే ఎవరుమాత్రం ఏమి చేయగలరు ? నిన్నటికి నిన్న ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులు చెల్లదని కోర్టు తీర్పిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇదికాకుండా తొందరలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన చాలా కేసులు తొందరలోనే తీర్పులు రాబోతున్నాయి. మరి వాటి విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.