గిఫ్ట్ కార్డుల పేరుతో ఘరానా మోసం ..ఆశ పడ్డారో అడ్డంగా బుక్కైపోతారు జాగ్రత్త !
అమాయకుల నుండి డబ్బు కాజేయడానికి మోసగాళ్లు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వారి ఉచ్చులో చిక్కిన వారి జేబులు ఖాళీ చేస్తుంటారు. తాజాగా గిఫ్ట్ కార్డుల పేరుతో మోసగాళ్ళు డబ్బులు గుంజుతున్న ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో సభ్యులంతా చదువుకున్నోళ్లే. వీరిలో బీహార్ కి చెందిన ఐదుగురితో పాటు మంచిర్యాలకు చెందిన మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి దగ్గరి నుంచి 900 స్క్రాచ్ కార్డులు, 2 ల్యాప్‌ట్యాప్‌లు, 10 ఆధార్ కార్డులు, 28 డెబిట్ కార్డులు, 42 ఫోన్లు, 2 రబ్బర్ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో 50శాతం నుంచి 75 శాతం డిస్కౌంట్ పొందేలా గిఫ్ట్ కార్డులు ఉన్నాయని ఊరిస్తారు. కేవలం నామమాత్రపు రుసుము చెల్లిస్తే ఆ కార్డుల్ని ఇంటికి పంపిస్తామని లేదా కార్డు నంబర్ ను మెయిల్ చేస్తామని చెప్తారు. అలా డబ్బులు దండుకున్న తర్వాత ఆ నెంబర్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్ వస్తుంది. కస్టమర్లకు ఫోన్లు చేసేందుకు వివిధ భాషలు తెలిసిన ఎగ్జిక్యూటివ్స్ ను కూడా వీళ్లు నియమించుకొని మరీ దందా చేశారు. నిందితులు ఇప్పటి వరకు మొత్తం రూ.2 కోట్లు దోచుకున్నట్టు సీపీ చెప్పారు. ఇక సైబరాబాద్ పరిధిలో ఇలాంటి ఘటనలు మూడు నమోదయ్యాయని సజ్జాన్నర్ వెల్లడించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి లెటర్స్ ఎవరికైనా వచ్చినా, డబ్బులు పంపాలంటూ కాల్స్ వచ్చినా వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.