చాలా సంక్షేమ పథకాలు కేంద్రం నిధులతోనే అమలు అవుతూ ఉంటాయి. వాటిల్లో రాష్ట్రం వాటా కూడా ఉంటుంది. కొన్ని స్కీమ్ ల విషయంలో అయితే మెజారిటీ వాటాలు కేంద్రం నుంచినే వస్తూ ఉంటాయి. మైనారిటీ వాటాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. అయితే రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వ పేరుతోనే చలామణిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే అన్ని స్కీమ్ లనూ అమలు చేస్తున్నట్టుగా పాలన సాగుతూ ఉంటుంది.
ఇలాంటి నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల వాళ్లు తరచూ క్రెడిట్ ను కోరుతూ ఉంటారు. తమ ప్రభుత్వం అందించిన నిధులతో పథకాలు అమలవుతూ ఉంటాయని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయినా అలాంటి ప్రచారాలకు పెద్ద ప్రచారం రాదు కూడా!
అయితే తన పాలన పారదర్శకంగా, నిజాయితీగా, నైతికతతో ఉండాలని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పథకాలకు కేంద్రానికి కూడా క్రెడిట్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఇప్పటికే రైతు భరోసా పథకంలో కేంద్రం క్రెడిట్ ను ఇస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఈ పథకంలో కేంద్రం వాటా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పథకం ప్రారంభానికి రావాలంటూ మోడీని ఆహ్వానించారు జగన్.
అంతే కాదట.. త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ ను పూర్తిగా మోడీ పేరుతోనే అమలు చేయనున్నారట జగన్. దానిలో రాష్ట్రం వాటా ఉన్నా..అందులో మెజారిటీ వాటా కేంద్రానిదే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ పథకాన్ని మోడీ పేరుతోనే అమల్లో పెట్టాలని జగన్ నిర్ణయించినట్టుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వ క్రెడిట్ ను అలా మోడీకే దక్కేలా జగన్ చర్యలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.