ఆధునికత ఎంత పెరిగిందో.. మనిషికి ఎంతలా సాయం పడుతుందో మనందరికీ తెలిసిందే.అయితే ఆ ఆధునికత ముసుగులో నేరాలు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అలాగే సోషల్ మీడియా స్నేహాలు కూడా శృతిమించుతున్నాయి. అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చిందంటే చాలు.. ఆలోచించకుండా ఆమె మాయలో పడిపోతాం.. మానసికంగానే కాకుండా ఆర్థికంగానూ నష్టపోతున్నారు. సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి.
వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వల వేసి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ వచ్చింది. దీంతో అతడు రిప్లై ఇచ్చాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం పెరిగి మాయలేడి ఉచ్చులో పడి ఏకంగా రూ.23 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లాలోని శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి వ్యవసాయం చేసుకుంటున్నాడు. రెండు నెలల క్రితం అతడి మొబైల్ కు హాయ్ అని మెసేజ్ వచ్చింది. ఆ నంబర్ అమ్మాయి పేరు మీద ఉండడం.. ప్రొఫైల్ అమ్మాయి ఫొటోతో ఉండడంతో స్నేహం పెరిగింది. తరచూ వాట్సాప్ కాల్స్, వీడియోకాల్స్ , మెసేజ్ లు చేసుకున్నారు.
ఇంతలో ఆ మాయలేడి నుంచి న్యూడ్ వీడియో కాల్స్ వచ్చాయి. ఇంకేముంది ముందూ వెనుకా ఆలోచించకుండా అతడు కాల్స్ మాట్లాడాడు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది.
ఆ వ్యక్తి న్యూడ్ గా మాట్లాడిన వీడియోలను రికార్డు చేసిన ఆ మాయలేడి.. వాటిని సోషల్ మీడియా లో బంధువులకు షేర్ చేస్తానని బెదిరించింది. అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు పంపాలని డిమాండ్ చేసింది. పరువు పోతుందని భావించిన ఆ వ్యక్తి దాదాపు రూ.23 లక్షలు వరకు ఆ అమ్మాయికి పంపించాడు. అయినా ఆ కిలాడీ బెదిరింపులు ఆగలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
అనంతపురం ఎస్పీ ఫకీరప్ప సైబర్ మోసాలపై బాధితులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు కానీ.. సైబర్ మిత్ర నంబర్ 9121211100కు కానీ ఫిర్యాదు చేయాలని సూచించాడు. కేవైసీ పేరుతో ఎవరు అడిగినా వివరాలు చెప్పకూడదని సూచించాడు.